డ్రైవర్‌తో లేచిపోయిన భార్య.. యూట్యూబర్ అఖిల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది
ABN, Publish Date - Sep 13 , 2026 | 10:18 PM
ఈ ఏడాది కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన యూట్యూబర్, నటుడు అఖిల్ ఎన్ఆర్డీ (Akhil NRD) కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ ఏడాది కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన యూట్యూబర్, నటుడు అఖిల్ ఎన్ఆర్డీ (Akhil NRD) కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎంతో క్రేజ్ ఉన్న అఖిల్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఆయన భార్య మేఘ నాయర్ ఊహించని రీతిలో బస్ డ్రైవర్‌తో లేచిపోవడం కన్నడ నాట వైరల్ న్యూస్‌గా మారింది. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది. అఖిల్ ఈ కష్ట సమయంలో చూపిన మనోధైర్యానికి, మెచ్యూరిటీకి నెటిజన్ల నుంచి ఎంతో సానుభూతి, మద్దతు లభించాయి.
ఈ తీవ్ర మనోవేదన,వ్యక్తిగత వివాదాల నడుమే అఖిల్ ఎన్ఆర్డీ కథానాయకుడిగా నటించిన మహారాజా హాస్టల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాస్టల్ లైఫ్‌లోని గొడవలు, సరదా ఘట్టాలు, యూత్ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిన్న చిత్రం జూన్ లో రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాలో అఖిల్ కామెడీ టైమింగ్, నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన మహారాజా హాస్టల్ చిత్రం తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ వేదికపైకి అందుబాటులోకి వచ్చింది. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అన్నీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియాలో అఖిల్ భార్య డ్రైవర్‌తో వెళ్ళిపోయిన కేస్ సృష్టించిన హైప్ కూడా ఈ సినిమా డిజిటల్ వ్యూయర్ షిప్‌కు కొంతవరకు కలిసి వచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. యూత్, స్టూడెంట్స్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ వేదికపై కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
వ్యక్తిగతంగా ఎంతో పెద్ద షాక్ ఎదురైనప్పటికీ, అఖిల్ ఎన్ఆర్డీ తన నటన, కంటెంట్‌తోనే సమాధానం చెబుతూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. మహారాజా హాస్టల్ ఓటీటీలోకి రావడంతో ఆయన అభిమానులు, కన్నడ సినీ ప్రియులు ఈ చిత్రాన్ని వీక్షిస్తూ అఖిల్‌కు సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పెడుతూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.