సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కెన్‌ కరుణాస్‌: 'యూత్‌' హీరోగా నిలబెట్టింది

ABN, Publish Date - Apr 02 , 2026 | 10:34 AM

స్వీయ దర్శకత్వంలో తాను హీరోగా నటించి విడుదల చేసిన ‘యూత్‌’ చిత్రానికి ఈ స్థాయిలో విజయం లభిస్తుందని  కలలో కూడా ఊహించలేదని, పైగా తనకు హీరోగా ఓ గుర్తింపునిచ్చిందని కెన్‌ కరుణాస్‌ పేర్కొన్నారు.


స్వీయ దర్శకత్వంలో తాను హీరోగా నటించి విడుదల చేసిన ‘యూత్‌’ చిత్రానికి ఈ స్థాయిలో విజయం లభిస్తుందని  కలలో కూడా ఊహించలేదని, పైగా తనకు హీరోగా ఓ గుర్తింపునిచ్చిందని హీరో, దర్శకుడు కెన్‌ కరుణాస్‌ పేర్కొన్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై గత నెల 19న విడుదలైన ఈ చిత్రం 11 రోజుల్లో రూ.50 కోట్ల మేర వసూలు చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం థ్యాంక్స్‌ గివింగ్‌ మీట్‌ను చెన్నైలో నిర్వహించింది. 

కెన్‌ కరుణాస్‌ మాట్లాడుతూ ‘ఈ మూవీ ప్రమోషన్‌ కూడా వైవిధ్యభరితంగానే చేశాం. దీన్ని ప్రేక్షకులు స్వీకరించి, మూవీని ఆదరించారు. ఈ ఘన విజయానికి నా స్నేహితులు కారణం. జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరపరిచిన పాటలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. ఈ సినిమా ద్వారా మాకు గుర్తింపు లభిస్తుందని ఊహించాం. ఇప్పుడు నాతో పాటు ఇందులో నటించిన అనేక యువ నటీనటులకు అవకాశాలు వస్తున్నాయి. నన్ను హీరో చేయాలని కోరిన వెంటనే అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక మంచి నిర్మాతను పరిచయం చేసిన నిర్మాత అమ్మాముత్తు సూర్యకు నా తుదిశ్వాస ఉన్నంతవరకు విశ్వాసంగా ఉంటాను’ అని పేర్కొన్నారు.

నిర్మాత కరుప్పయ్య మాట్లాడుతూ ‘చేతిలో పైసా లేకుండా, యువ కళాకారుల ప్రతిభను నమ్మి సినిమా ప్రారంభించాం. ఈ కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉండటంతో పలువురు స్నేహితుల నుంచి రుణాలు తీసుకుని సినిమా పూర్తి చేశాం. కష్టకాలంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పార్వత ఎంటర్‌టైన్మెంట్స్‌ యువ కళాకారులను ప్రోత్సహించే నిర్మాణ సంస్థగా ఉంటుంది. మా సంస్థకు ఎవరైనా తమ స్ర్కిప్టు మెయిల్‌ చేయొచ్చు. వాటిని పరిశీలించి అవకాశం కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. 

మలయాళ నటుడు సూరజ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు గొప్ప అనుభూతినిచ్చింది. దర్శకుడు కెన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకలో హీరోయిన్‌ మీనాక్షి, సీనియర్‌ నటి నళిని, నటి దేవదర్శినితో పాటు చిత్ర బృందం పాల్గొంది.
.............................................

Updated Date - Apr 02 , 2026 | 11:05 AM