సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kollywood: కోలీవుడ్‌లో యువ హీరోయిన్ల హవా.. వరుస హిట్లతో పెరుగుతున్న క్రేజ్!

ABN, Publish Date - Sep 11 , 2026 | 03:03 PM

కోలీవుడ్‌లో ప్రస్తుతం యువ హీరోయిన్ల హవా కొనసాగుతోంది. కొత్త కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న ఈ భామలకు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి.

కోలీవుడ్‌లో ప్రస్తుతం యువ హీరోయిన్ల హవా కొనసాగుతోంది. కొత్త కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న ఈ భామలకు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా కేరళకు చెందిన హీరోయిన్లు తమిళ చిత్ర పరిశ్రమలో తమ సత్తా చాటుతున్నారు. ఈ జాబితాలో అనిష్మా అనిల్ కుమార్, మమితా బైజు(Mamitha baiju) , కయదు లొహర్(Kayadu lohar), ఐశ్వర్య లక్ష్మి వంటి కథానాయికలు ముందంజలో ఉన్నారు.

అనిష్మా అనిల్ కుమార్ ఇప్పటికే ‘సిరై’, ‘యూత్’, ‘మొద రాత్రి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వరుస విజయాలతో ఆమె మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగింది. గ్లామర్, ఎక్స్‌పోజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా కథకు, పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాకాళి’ చిత్రంలో నటిస్తున్నారు.

‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా భారీ గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. ఆ తర్వాత తమిళంలో వరుస అవకాశాలు అందుకున్నారు. ‘డ్యూడ్’, ‘కర’, ‘జన నాయగన్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఇరండు వానమ్’ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కోలీవుడ్‌లో మమితా బైజుకు మరింత క్రేజ్ పెరుగుతోంది.

మరోవైపు కయదు లొహర్ కూడా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆమె నటించిన ‘ఇదయం మురళి’, ‘డ్రాగన్’, ‘ఇమ్మోర్టల్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మంజణతి’తో పాటు సూర్య–జ్ఞానవేల్ కాంబినేషన్‌లో రానున్న చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు.

ఇక ‘గట్టా కుస్తీ-2’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఐశ్వర్య లక్ష్మికి కూడా మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస హిట్లతో యువ కథానాయికలు కోలీవుడ్‌లో తమ మార్కెట్‌ను పెంచుకుంటూ.. సీనియర్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ALSO READ:
GV Prakash: జి.వి. ప్రకాశ్‌కు ఆర్ఎక్స్100 బైక్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత..  
Samyuktha: 'స్వయంభూ'లో వీరనారిగా సంయుక్త.. కత్తి పట్టి యుద్ధం చేస్తూ అదుర్స్!

Samantha: ఒక దశలో నటనను వదిలేయాలనుకున్నా.. సమంత సంచలన వ్యాఖ్యలు..




Updated Date - Sep 11 , 2026 | 03:11 PM