యశ్ 'టాక్సిక్' టీజర్.. బ్లడీ బ్రూటల్ బ్లడ్ బాత్! చూసి.. తట్టకోగలరా
ABN, Publish Date - Feb 20 , 2026 | 10:40 AM
యశ్ కేజీఎఫ్ వంటి గ్టోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రం అనంతరం నాలుగేండ్ల సమయం తీసుకుని మరి నటించిన చిత్రం టాక్సిక్ తెలుగు టీజర్ విడుదలైంది.
కన్నడ స్టార్ యశ్ (Yash) కేజీఎఫ్ (K.G.F: Chapter 2) వంటి గ్టోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రం అనంతరం నాలుగేండ్ల సమయం తీసుకుని మరి నటించిన చిత్రం టాక్సిక్ (Toxic). సీనియర్ నటి గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహించగా కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మించింది. నయనతార (Nayanthara), కియారా అద్వాని (Kiara Advani), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth), హుమా ఖురేషి (Huma Qureshi), తారా సుతారియా వంటి కథనాయికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ప్రశంసలు, విమర్శలు, కేసులు తీసుకురాగా తాజాగా శుక్రవారం ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. టీజర్‌ను చూస్తే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్, బోల్డ్‌గా తెరకెక్కించినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేగాక శృతిమించిన హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లతో అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో కేజీఎఫ్‌ను మించి హై లెవల్ ఎలివేషన్లతో సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది.
ఇక విజువల్స్, టేకింగ్ మాత్రం హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో ఉన్నాయి. అయితే.. ఈ మూవీలో ఐదుగురు ముద్దుగుమ్మలు నటిస్తున్నప్పటికీ ఏ ఒక్కరి డీటెయిల్ కూడా టీజర్‌లో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే మన దేశంలో వచ్చిన మార్కో, యానిమల్, కిల్లర్, భాగీ 4 సినిమాలను తలదన్నేలా బ్రూటల్ బ్లడ్ బాత్‌తో చూసే వారికే వాంతులు వచ్చేలా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి.దీంతో టీజర్‌పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.