సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాక్సిక్ మేనియా.. బాలీవుడ్‌కు యశ్ గట్టి వార్నింగ్!

ABN, Publish Date - Feb 25 , 2026 | 09:41 AM

రాకీ భాయ్ ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ దగ్గర అభిమానులకు ఓ రేంజ్‌లో పూనకాలు వస్తాయి. కేజీయఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో యశ్‌.

Yash Toxic

రాకీ భాయ్.. ఈ పేరు వింటేనే బాక్సాఫీస్ దగ్గర అభిమానులకు ఓ రేంజ్లో పూనకాలు వస్తాయి. కేజీయఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో యశ్‌ (yash), ఇప్పుడు మరో పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాతో మన ముందుకు వస్తున్నారు. అదే.. టాక్సిక్ (Toxic A Fairy Tale for Grown Ups). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ రిలీజ్ అయిందో అప్పట్నుంచి టాక్సిక్‌ సినిమాపై హైప్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేజీయఫ్ తర్వాత యశ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

టాక్సిక్‌ సినిమా కేవలం ఒక రీజనల్ మూవీ కాదు, దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ చూస్తుంటే, యశ్‌ బాడీ లాంగ్వేజ్ నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు అన్నీ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ చిత్రం తన సొంత గడ్డ అయిన కన్నడ ఇండస్ట్రీ కంటే ఎక్కువగా తెలుగు, హిందీ, తమిళ మార్కెట్లపై కన్నేసింది. యశ్‌ ఇమేజ్ ఇప్పుడు కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదు. అందుకే మేకర్స్ కూడా ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌కు నచ్చేలా ప్లాన్ చేశారు. అయితే, టాక్సిక్ మూవీకి బాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతోంది. గతేడాది హిందీలో భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ చిత్రానికి సీక్వెల్ కూడా సరిగ్గా అదే రోజున అంటే మార్చి 19నే రిలీజ్ అవుతోంది. మొదట్లో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు టాక్సిక్‌ను అంతగా పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

యశ్‌ క్రేజ్ చూసి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు సైతం షాక్ అవుతున్నారు. హిందీ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నార్త్ ఇండియాలో కూడా యశ్‌ బాక్సాఫీస్ వద్ద ధురంధర్‌ 2కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, యశ్‌ మార్కెట్ వాల్యూ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టాక్సిక్ తెలుగు రైట్స్‌ను ఏకంగా 120 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారని ఇండస్ట్రీ టాక్. ఒక కన్నడ హీరో సినిమాకు తెలుగులో ఈ స్థాయి రేటు పలకడం మామూలు విషయం కాదు. భారీ బడ్జెట్, ఇంటెన్స్ యాక్షన్, యశ్‌ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్.. వెరసి టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తోంది. మరి టీమ్ పెట్టుకున్న ఈ భారీ అంచనాలను యశ్‌ అందుకుంటారా..? యశ్‌ రాకీ భాయ్ మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేస్తారా? ఈ విషయం తెలియాలంటే మార్చి 19 వరకు ఆగాల్సిందే.

Updated Date - Feb 25 , 2026 | 12:40 PM