సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గీతూతో మ‌రో సినిమా.. నో చెప్పిన య‌శ్‌! ఆ డైరెక్ట‌ర్‌కు.. గ్రీన్ సిగ్న‌ల్‌

ABN, Publish Date - Aug 31 , 2026 | 10:30 AM

య‌శ్ త‌ర్వాతి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

yash

'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ (Yash) తాజాగా టాక్సిక్ (Toxic) చిత్రంతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రాగా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటున్న‌ది. సుమారు ఐదేండ్ల స‌మ‌యం కేటాయించి మ‌రి చేసిన ఆ చిత్రం నిరాశనే మిగ‌ల్చ‌డంతో య‌శ్ త‌ర్వాతి సినిమా ఏంట‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా సినీ వర్గాల ప్రచారం ప్రకారం.. ముందు నుంచి అనుకున్న‌ట్లుగా యష్ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) తో కలిసి చేయాల‌నుకున్న మ‌రో ప్రాజెక్టును ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఏడాది లోపే ఓ సినిమా చేసి రిలీజ్ చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్న‌ట్లుగా తెలియ వ‌స్తోంది. ఇందుకోసం య‌శ్‌ మొద‌ట‌గా తెలుగు డైరెక్ట‌ర్ల వైపు చూసిన‌ప్ప‌టికీ ఇక్క‌డీ వారంతా బిజీగా ఉండ‌డంతో లేటెస్ట్‌గా క‌న్న‌డ సెన్షేష‌నల్‌ డైరెక్ట‌ర్ హేమంత్ ఎం. రావు (Hemanth M Rao) తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

స‌ప్త సాగ‌రాలు దాటి సినిమాతో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొతంతం చేసుకున్న హేమంత్ చెప్పిన క‌థ య‌శ్‌కు న‌చ్చింద‌ని ప్ర‌స్తుతం స‌ట్ఓరీ డెవ‌ల‌ప్ మెంట్ జ‌రుగుతుంద‌ని అతి త్వ‌ర‌లోనే ఈ క‌థ ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై యష్ టీమ్ గానీ, సంబంధిత దర్శకుల గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలుగానే భావించాల్సి ఉంది.

Updated Date - Aug 31 , 2026 | 10:57 AM