Yash: యశ్ కోసం క్యూ కడుతున్న టాప్ డైరెక్టర్లు..
ABN, Publish Date - Sep 17 , 2026 | 10:48 AM
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు మరింత భారీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు.
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ (KGF) సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు మరింత భారీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన ‘టాక్సిక్’ పరాజయం పాలైంది. త్వరలో రాబోతున్న ‘రామాయణ’లో (Ramayana) రావణుడిగా కనిపించనున్నారు. అయితే యశ్ తదుపరి సినిమాపై ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (Yash Five crazy projects)
యశ్‌తో కలిసి పనిచేయాలని పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఐదుగురు టాప్ ఫిల్మ్‌మేకర్స్ యశ్‌కు భారీ కథలను ఆఫర్ చేసినట్లు ఓ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో రెండు బాలీవుడ్ దర్శకుల ప్రాజెక్టులు కాగా.. మిగతావి దక్షిణాది నుంచి వచ్చిన కథలని సమాచారం.
పీఎస్ మిత్రన్ యాక్షన్–అడ్వెంచర్
తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ ఇప్పటికే యశ్‌ను కలిసి ఓ కథను నేరేట్ చేశారని, పూర్తి యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. జంగిల్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ఈ కథను డిజైన్ చేశారట.
ఆదిత్య ధర్.. పాన్ వరల్డ్ లైన్..
బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. ఆయన ప్రస్తుతం రెండు భారీ స్క్రిప్టులను సిద్ధం చేసినట్లు, పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించాలనే ఆలోచనతో ఈ కథలను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ప్రాజెక్ట్ రణ్‌వీర్ సింగ్‌తో చేయనున్నట్లు ప్రచారం ఉండగా.. మరో కథను యశ్‌కు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌పై యశ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందట.
పీరియడ్ కథతో..
కన్నడ దర్శకుడు హేమంత్ రావు కూడా యశ్‌కు ఓ ఆసక్తికరమైన కథను వినిపించినట్లు సమాచారం. పీరియడ్ ఎరాలో సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేలా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కథా నేపథ్యం, భారీ స్కేల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై కూడా ఆసక్తి నెలకొంది.
దిల్ రాజు.. భారీ ఆఫర్
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కూడా యశ్‌తో ఓ భారీ యాక్షన్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘రామాయణ’ విడుదల కోసం ఎదురుచూస్తున్న ఆయన.. ఆ తర్వాత యశ్‌కు కథ వినిపించే అవకాశం ఉందని టాక్. భారీ యాక్షన్ స్పేస్‌లో దిల్ రాజు వద్ద రెండు కథలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి సల్మాన్ ఖాన్‌తో ‘మాన్‌స్టర్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. రెండో కథను యశ్ తో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
YRF గ్యాంగ్‌స్టర్ డ్రామా?
యశ్ జాబితాలో అత్యంత ప్రతిష్టాత్మక బ్యానర్ యశ్‌రాజ్ ఫిల్మ్స్ (YRF) కూడా ఉంది. యశ్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించేందుకు ఈ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. డిస్టర్బింగ్, ట్రాజిక్ లవ్‌స్టోరీతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ కథ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. మోహిత్ సూరి దర్శకత్వం వహించే అవకాశం ఉందని, రామ్‌గోపాల్ వర్మ కథను అందిస్తున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే వీటిలో ఏది కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ లైనప్ ఓకే అయితే.. తక్కువలో తక్కువ నాలుగేళ్లు యశ్ డైరీ ఫుల్ అయిపోయినట్టే.