Drishyam 3: అందుకే.. వెంకటేశ్‌తో దృశ్యం 3 రీమేక్ చేయలేదు! అసలు గుట్టు.. బయట పెట్టిన డైరెక్టర్
ABN, Publish Date - Jun 10 , 2026 | 05:27 PM
ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దృశ్యం3 ని మాత్రం తెలుగు,తమిళం భాషల్లో ఎందుకు రిమేక్ చేయలేదనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతంలో.. మలయళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న 'దృశ్యం' రెండు చిత్రాలను ఆ తరువాత ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్ హసన్, హిందీలో అజయ్ దేవగణ్ వంటి స్టార్లు నటించి మెప్పించారు.
అయితే ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దృశ్యం 3 (Drishyam 3) ని మాత్రం తెలుగు,తమిళం భాషల్లో ఎందుకు రిమేక్ చేయలేదనే సందేహాన్ని కొన్ని రోజులుగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఈ చిత్రాన్ని హిందీ మినహా ఇతర భాషల్లో రీమేక్ చేయకపోవడానికి వెనుక ఉన్న అసలు కారణాలను చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) వెల్లడించారు. ' 'దృశ్యం 3'లోని క్లైమాక్స్‌ను ఇతర భాషల్లో ప్రేక్షకులు ఒప్పుకోరు. ముఖ్యంగా ఆ భాషల్లోని హీరోల ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ క్లైమాక్స్ వారికి సమస్యగా మారుతుంది. కానీ హిందీ వాళ్లు కథలో కొన్ని మార్పులు చేసుకుంటామని చెప్పారు. అందుకు నేను ఓకే అన్నాను' అని పేర్కొన్నారు. ఇక 'దృశ్యం 4' గురించి చెబుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగో భాగంపై హామీ ఇవ్వలేనని స్పష్టం చేశారు.