సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విత్ లవ్.. ఓటీటీలోకి వచ్చేస్తోంది

ABN, Publish Date - Mar 01 , 2026 | 05:16 PM

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న డైరెక్టర్ అభిషన్ జీవింత్ (Abishan Jeevinth). మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిన అభిషన్ హీరోగా మారారు.

with Love

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న డైరెక్టర్ అభిషన్ జీవింత్ (Abishan Jeevinth). మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిన అభిషన్ హీరోగా మారారు. మదన్ దర్శకత్వంలో అభిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం విత్ లవ్ (With Love). అనశ్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్ నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 6 న రిలీజ్ అయిన విత్ లవ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సుమారు 90 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

విత్ లవ్ తాజాగా ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో విత్ లవ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సత్య (అభిషన్ జీవింత్) ఒక ఆర్కిటెక్ట్. అతనికి ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ, ఏ అమ్మాయి సత్యకు నచ్చదు. చివరికి కుటుంబ సభ్యులు ఫోర్స్ చేయడంతో మోనీషా (అనశ్వర రాజన్) ని కలవడానికి వెళ్తాడు. మాటల మధ్యలో వారు చిన్ననాటి స్నేహితులు అని, ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారని తెలుస్తుంది.

ఇక ఇద్దరూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తమ స్కూల్లో తాము మొదట ఇష్టపడిన వారిని కలవాలని అనుకుంటారు. ఆ తరువాత వారి ప్రయాణం ఎలా మొదలైంది.. ? వారు కలవాలనుకున్న ఫ్రెండ్స్ ను కలిశారా.. ? చివరకు సత్య ఎవరిని పెళ్లి చేసుకున్నాడు.. ? మోనీషా రాకతో సత్య లైఫ్ ఎలా మారింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. థియేటర్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Mar 01 , 2026 | 06:33 PM