సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

With Love: అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా 'విత్ లవ్'

ABN, Publish Date - Jan 31 , 2026 | 03:29 PM

'టూరిస్ట్ ఫ్యామిలీ' ఫేమ్ అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'విత్ లవ్' మూవీ ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నట్టు రానా తెలిపారు.

With Love trailer Launch

తమిళంలో సూపర్ హిట్ అయిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా నటించిన సినిమా 'విల్ లవ్'. ఈ సినిమా ఫిబ్రవరి 6న జనం ముందుకు రాబోతోంది. మదన్ రచన చేసి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అసన్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను సౌందర్య రజనీకాంత్ తో పాటు నజరత్ పసిలియన్, మహేశ్ రాజ్ పసిలియన్ నిర్మించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.


ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ, 'చెప్పలేని ప్రేమ గురించి ఇక్కడ అంతా చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడారు. ట్రైలర్ చూసిన అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. చూస్తున్నప్పుడు ఇది మన కథే అనిపిస్తోంది. సౌందర్య రజనీకాంత్ గారు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. హీరో అభిషన్ జీవింత్ మాట్లాడుతూ, 'నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ'ని మీరంతా గొప్పగా ఆదరించారు. 'విత్ లవ్' కూడా చాలా అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా. అందరూ కూడా కనెక్ట్ అవుతారు. మన జ్ఞాపకాలని నెమరు వేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇది మీ అందరికీ ఫేవరెట్ సినిమా అవుతుంది. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.


'ఛాంపియన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మాట్లాడుతూ, 'ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత మీరందరూ కరెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ కూడా సినిమా చూస్తున్నప్పుడు అలానే కరెక్ట్ అవుతారు. ఇది చాలా క్యూట్ సినిమా. అందరూ కూడా సినిమాని థియేటర్లో చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. హైదరాబాద్ మరోసారి రావడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ, 'రానా నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్. తనతో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి చెప్పగానే తన సినిమాగా భావించి ముందుకు తీసుకొచ్చారు. అభిషన్ ని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తను డైరెక్ట్ గా మంచి సక్సెస్ ఇచ్చాడు. ఈ సినిమాలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనస్వర ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేస్తోంది. ఫిబ్రవరి 6న తప్పకుండా ఈ సినిమా మీరందరూ థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు. మరో నిర్మాత మహేశ్ రాజ్ సైతం సినిమా గురించి మాట్లాడారు.

Updated Date - Jan 31 , 2026 | 03:31 PM