Vijay-Trisha: త్రిష రాగానే విజయ్ ఎందుకు ముఖం తిప్పుకున్నారు? నెటిజన్ల చర్చ!
ABN, Publish Date - Sep 13 , 2026 | 07:30 AM
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో (Vijay) విజయ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఈవెంట్‌లో నటి త్రిష కూడా కనిపించడంతో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విజయ్, త్రిష (Trisha) కలిసి కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. దీంతో వీరి కాంబినేషన్‌కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో విజయ్ రేసింగ్ ఈవెంట్‌ను వీక్షిస్తూ కనిపించారు. అదే సమయంలో త్రిష అక్కడికి రావడంతో విజయ్ తన ముఖాన్ని కెమెరాకు కనిపించకుండా పక్కకు తిప్పుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో త్రిషతో కలిసి కనిపించిన విజయ్.. ఇప్పుడు మాత్రం కెమెరాకు దూరంగా ఉండేందుకు ఎందుకు ప్రయత్నించారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు విజయ్ పరిస్థితి వేరు ఇప్పుడు వేరు. ప్రస్తుతం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొందరు అభిమానులు అదే అనుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తన ప్రవర్తన విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ కూడా మొదలైంది. త్రిషతో కలిసి కనిపిస్తే సోషల్ మీడియాలో అనవసరమైన చర్చ, ట్రోలింగ్ మొదలవుతుందనే ఉద్దేశంతోనే విజయ్ కెమెరాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించారా? అన్నది కూడా నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. మరి కొందరు అయితే సీఎం సార్ భయపడ్డారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కార్ రేస్ పూర్తయిన అనంతరం విజయ్ రేసర్ అజిత్ ను ఆలింగనం చేసుకుని అభినందించారు.