Dark: చనిపోయిన వ్యక్తి.. అకస్మాత్తుగా కళ్ళు తెరిస్తే?
ABN, Publish Date - Jul 06 , 2026 | 05:35 PM
చనిపోయాడని భావించిన వ్యక్తి అకస్మాత్తుగా కళ్ళు తెరిస్తే ఆ తరువాత జరిగే పరిణామా లేంటి? అనే కథాంశంతో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ డార్క్.
చనిపోయాడని భావించిన వ్యక్తి అకస్మాత్తుగా కళ్ళు తెరిస్తే ఆ తరువాత జరిగే పరిణామాలేంటి? అనే కథాంశంతో తెరకెక్కిన తమిళ థ్రిల్లర్ మూవీ డార్క్ (Dark). అజయ్ కార్తిక్ (Ajay Karthi) అంజన నేత్రన్ జంటగా నటించిన ఈ చిత్రంలో కె.భాగ్యరాజ్, నట్టి, వీటీవీ గణేష్ ఇందుమతి మణికంఠన్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతుంది.
కళ్యాణ్ కె.జగన్ (Kalyan K. Jegan) దర్శకుడు "ముగ్గురు యువకులు కలిసి నివసించే ఇంటిలో జరిగిన దారుణమైన హత్య ఆత్మహత్యల తర్వాత ఆ ఇంటిని దెయ్యాల కొంపగా పిలుస్తుంటారు. ఈ నిజం తెలిసినప్పటికీ హీరో అజయ్ కార్తీక్ తక్కువ అద్దె కారణంగా ఆ ఇంటిలో దిగుతాడు. ఆరంభంలో ధైర్యంగా ఉన్నప్పటికీ చివరకు ఆ ఇంట్లో జరిగే అతీంద్రియ సంఘటన వల్ల మానసింగా కలత చెందుతాడు.
అలాంటి వాతావరణంలో అజయ్ కార్తిక్ తో పాటు ఇంటి యజమాని కె.భాగ్యరాజ్ (Bhagyaraj) కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. ఈ కేసులను విచారించేందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నట్టి నటరాజ్ వస్తాడు. అయితే, చనిపోయాడని భావించిన అజయ్ కార్తీక్ అకస్మాత్తుగా కళ్ళు తెరవడంతో నట్టి షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని హార్రర్, థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కించారు. ఎంజీ స్టూడియోస్ పతా కంపై ఏపీపీ మారన్, గణేష్ బాబు, కె.సెంథిల్ నిర్మించారు.