సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ravi Mohan: న‌లుగురం.. క‌లిసి ఉండ‌లేం! ర‌వి మోహ‌న్.. ఇన్ స్టా పోస్ట్ వైర‌ల్‌

ABN, Publish Date - Aug 03 , 2026 | 09:16 AM

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ హీరో రవి మోహన్ తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్ అయింది.

Ravi Mohan

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ హీరో రవి మోహన్ (Ravi Mohan) తన ఇన్‌స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్ అయింది. నేను జీవించివున్నంత వరకు మేం నలుగురం ఒకే ఇంటిలో కలిసి ఉండలేం' అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ తన భార్య, ఇద్దరు కుమారులను ఉద్దేశించి అయివుంటుందని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నారు. రవి మోహన్ ఆర్తి (Aarti) దంపతుల విడాకుల కేసు ప్ర‌స్తుతం కోర్టులో సాగుతోంది.

ఈ నేపథ్యంలో రవి మోహన్ ఆదివారం ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేస్తూ, 'నేను అత్యంత అమితంగా ప్రేమించే వారికి ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు. నిజమైన స్నేహితులుగా నా పక్కన నిలబడినందుకు ధన్యవాదాలు. కొందరు వ్యక్తులు కోర్టు ధిక్కరణకు పాల్పడేలా ప్రవర్తించడం దురదృష్టకరం. నా వరకు నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను బతికి ఉన్నంత కాలం మేం నలుగురం మళ్ళీ ఎప్పటికీ ఒకే ఇంటిలో కలిసి ఉండలేం. ఎపుడూ సంతోషంగా ఉండండి. మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి' అని పేర్కొన్నారు. ఆపై జాలీ మూడ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా త‌న ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

ఇదిలాఉంటే.. ఇటీవ‌ల ర‌వి మోహ‌న్ అత్త, ఆర్తి అమ్మ సుజాత విజయకుమార్ (Sujatha Vijayakumar) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ర‌వి దంప‌తులు, కుమారులు ఇరువురు కొన్నాళ్ల పాటు నెల‌కోసారి క‌లుసుకుని మాట్లాడుకోవ‌చ్చ‌ని న్యాయ‌మూర్తి చెప్పార‌ని బ‌య‌ట వినిపిస్తున్న‌, ప్ర‌చారం అవుతున్న వార్త‌ల‌ను ప‌ట్టిచ్చుకోవ‌ద్ద‌ని తెలిపింది. ఈ స‌మ‌యంలోనే ఇప్పుడు ర‌వి మోహ‌న్ చేసిన పోస్టు మ‌రో అర్థం వ‌చ్చేలా ఉండ‌డంతో ఈ స‌మ‌స్య ఇప్ప‌ట్లో ముగిసేలా లేద‌ని నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు.

Updated Date - Aug 03 , 2026 | 09:25 AM