సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రేమలోని పలు కోణాలతో ‘వవల్స్‌’ ఆంథాలజీ 

ABN, Publish Date - Mar 05 , 2026 | 09:48 AM

ప్రేమలోని పలు కోణాలను వివరించే ఆంథాలజీ మూవీ  ‘వవల్స్‌’ (ఎన్‌ అట్లాస్‌ ఆఫ్‌ లవ్‌)కి ఐదుగురు  దర్శకత్వం వహించారు.

ప్రేమలోని పలు కోణాలను వివరించే ఆంథాలజీ మూవీ  ‘వవల్స్‌’ (VOWELS) (ఎన్‌ అట్లాస్‌ ఆఫ్‌ లవ్‌)కి ఐదుగురు  దర్శకత్వం వహించారు. ఇందులో ఐదు కథలకు దిలీప్‌ కుమార్‌, సంగీత్‌, హేమంత్‌ కుమార్‌, సంతోష్‌ రవి, జగన్‌ రాజేంద్రన్‌ డైరెక్ట్ చేశారు. యూకిసేతు, చిన్ని జయంత్‌, సంయుక్తా విశ్వనాథన్‌, రాజ్‌ అయ్యప్ప, దీపక్‌ పరమేష్‌ తదితరులు నటించారు. మార్చి 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  కన్నడ నిర్మాత రాజు షెరేఖ నిర్మించిన ఈ  చిత్రం ఆడియో రిలీజ్‌ వేడుక చెన్నైలో తాజాగా జరిగింది. ఇందులో నిర్మాత రాజు షెరేఖ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఐదు విభిన్న ప్రేమ కథలున్నాయి. ఈ సినిమా నేటి యువత మనస్తత్వాన్ని, ప్రేమ పట్ల వారి దృక్పథాన్ని చూపిస్తుంది' అని అన్నారు. 

సీనియర్‌ నటుడు చిన్ని జయంత్‌ మాట్లాడుతూ, ‘చిత్ర నిర్మాతలు చాలా ధైర్యవంతులు. కర్ణాటక నుంచి ఇక్కడకు వచ్చి తమిళంలో చిత్రాన్ని నిర్మించారు. మంచి కథా చిత్రాలను కోలీవుడ్‌ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఐదుగురు దర్శకుల ఐక్యత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 

Updated Date - Mar 05 , 2026 | 12:29 PM