సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishal: విశాల్‌ సరసన కయదు లొహర్‌?

ABN, Publish Date - Jan 02 , 2026 | 07:45 AM

సుందర్‌ సి–విశాల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూడో సినిమాలో హీరోయిన్‌గా కయదు లొహర్‌ ఎంపిక? కోలీవుడ్ తాజా అప్‌డేట్.

Vishal

కోలీవుడ్‌లో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. ప్రముఖ దర్శకుడు సుందర్ సి (Sundar C), హీరో విశాల్ (Vishal) కలయికలో తెరకెక్కనున్న మూడో చిత్రంలో హీరోయిన్‌గా కయదు లొహర్ (Kayadu Lohar) ను ఎంపిక చేసేందుకు చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఇంతకుముందు సుందర్‌–విశాల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంబల’, ‘మదగజరాజా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ విజయాలతో మూడో సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం దర్శకుడు సుందర్‌ సి ‘మూక్కుత్తి అమ్మన్‌–2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు విశాల్‌ ‘మకుటం’ సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరూ తమ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన సుందర్‌ సి వ్యక్తిగత కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో విశాల్‌ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Updated Date - Jan 02 , 2026 | 10:26 AM