సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎంజీఆర్‌పై.. రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలు బాధాకరం!

ABN, Publish Date - Mar 12 , 2026 | 11:57 AM

టి.ఎల్. కాంతారావు స్మారక అవార్డు ప్రదానోత్సవంలో రాజేంద్ర ప్రసాద్... ఎంజీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలను ప్రముఖ నటుడు విశాల్ ఖండించారు. రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.

Vishal

ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad) ఇటీవల చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. టి.ఎల్. కాంతారావు (T.L. Kantharao) స్మారక పురస్కారాన్ని అందుకున్న సందర్భంలో రాజేంద్ర ప్రసాద్... ఆయన్ని పొగుడూ, స్వర్గీయ ఎం.జి.ఆర్. (MGR) ను కించపరుస్తు కొన్ని వ్యాఖ్యలను చేశారు. దీనిపై ప్రముఖ కథానాయకుడు విశాల్ (Vishal) స్పందించారు. రాజేంద ప్రసాద్‌ వంటి సీనియర్ నటుడు చేయాల్సిన వ్యాఖ్యలు కావని ఆవేదన వ్యక్తం చేశారు. విశాల్ తన భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, డైరెక్ట్‌గా రాజేంద్ర ప్రసాద్‌ను ఉద్దేశించి, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాజేందప్రసాద్ చేసిన వ్యాఖ్యలను విన్నానని, చాలా షాకింగ్‌గా, బాధాకరంగా అనిపించాయని విశాల్ వాపోయారు. రాజేంద్ర ప్రసాద్‌ మీద ఉన్న గౌరవంతో, ఎంతో బాధతో తన మనసులోని మాట చెబుతున్నానని అంటూ, 'మా దివంగత లెజెండరీ నటుడు, ఏకైక మహానటుడు ఎంజీఆర్‌ గారి గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఎంజీఆర్ గారు కేవలం గొప్ప నటుడే కాకుండా తమిళనాడులో గొప్ప నాయకుడిగా నిలిచారు. మీరు మరో లెజెండరీ నటుడు కాంతారావు గారిని ప్రశంసించడం చాలా మంచి విషయం. అయితే అదే సమయంలో ఇప్పటికీ కోట్లాది మంది అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన ఎంజీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడటం ప్రజల భావోద్వేగాలను విస్మరించడమే. దయచేసి ఈ విషయానికి మీరు సరైన విధంగా ముగింపు పలకాలని నేను కోరుకుంటున్నాను. మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో మీలాంటి గొప్ప నటుడి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే కూడా నేను ఇదే రకంగా స్పందిస్తాను. మీపై నాకు ఎంతో గౌరవం ఉంది. మంచి మనసుతో మీరు ఈ విషయమై స్పందిస్తారని ఆశిస్తున్నాను' అని విశాల్ ఆ ట్వీట్‌లో తెలిపాడు. ఇప్పటికే తమిళనాట కొందరు రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలను ఖండించారు. మరి జరిగిన పొరపాటుకు రాజేంద్ర ప్రసాద్‌ సారీ చెబుతారా లేదా అనేది చూడాలి.

Updated Date - Mar 12 , 2026 | 12:46 PM