సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విజయ్- త్రిష పెళ్ళి.. ముహూర్తం ఫిక్స్

ABN, Publish Date - May 08 , 2026 | 01:30 PM

త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ పేరు మారుమ్రోగిపోతోంది.

Vijay–Trisha

త్రిష కృష్ణన్ (Trisha Krishnan).. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ఒకప్పుడు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇప్పుడు దళపతి విజయ్ (Vijay) తో ప్రేమాయణం నడిపిస్తోంది అనే వార్తల వలన గుర్తింపు తెచ్చుకొంటోంది. విజయ్ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం త్రిష అనే చెప్పుకొస్తోన్నారు. త్రిష కోసం విజయ్.. తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని సంగీతనే అధికారికంగా తెలిపింది.


ఎలక్షన్స్ ముందు విజయ్ - త్రిష రిలేషన్ ని తప్పు అన్నవాళ్ళే గెలిచాకా ఈ జంట పెళ్ళి చేసుకోవాలని కోరుకోవడం గమనార్హం. రికార్డ్ విజయాన్ని అందుకున్న విజయ్.. త్వరలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇక దాని తరువాత త్రిషను ఆయన రెండో పెళ్ళి చేసుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా సంగీతతో విడాకులు తీసుకున్నాకా.. విజయ్, త్రిష మెడలో తాళి కట్టనున్నాడట.


1999 లో విజయ్, సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక త్రిష, విజయ్ జీవితంలోకి వచ్చాకా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. చాలాకాలంగా సంగీత, విజయ్ కి దూరంగా పిల్లలతో కలిసి ఉంటుంది. ఇక ఎన్నికల ముందు సంగీత.. తన భర్త నుంచి విడాకులు కావాలని కేసు వేయడం సంచలనంగా మారింది. తన భర్తకు వేరే నటితో ఎఫైర్ ఉందని, అందుకే అతని నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం విజయ్ - సంగీత విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో ఉంది. అతి త్వరలోనే వీరి విడాకులు మంజూరు కానున్నాయని, ఆ తరువాత విజయ్- త్రిష పెళ్ళి చేసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Updated Date - May 08 , 2026 | 01:43 PM