సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం.. క‌న్నీళ్లు పెట్టుకున్న త్రిష‌

ABN, Publish Date - May 11 , 2026 | 07:04 AM

నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో విజ‌య్ (vijay) ఎట్ట‌కేల‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు.

trisha

నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో విజ‌య్ (vijay) ఎట్ట‌కేల‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జ‌రిగిన‌ విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష (trisha krishnan) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లేత నీలి రంగు చీర, క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి.. కొప్పున పూలు, మెడలో వజ్రాల నెక్లెస్లో వేదికవైపు వస్తున్న త్రిషను చూసి టీవీకే కార్యకర్తలు చప్పట్లతో స్వాగతించారు.

ముందు వరుసలో ఆసీనులైన విజయ్ తల్లిదండ్రులను త్రిష పలకరించారు. విజయ్ తల్లి శోభను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. తర్వాత కార్యకర్తలవైపు చేతులు ఊపుతూ వెనుక వరుసలో కూర్చున్నారు. కానీ విజ‌య్ భార్య‌, పిల్ల‌లు మాత్రం ఈ కార్య‌క్ర‌మానికి హ‌జ‌రు కాలేదు.

అయితే.. విజ‌య్ అనే నేను అంటూ విజ‌య్‌ ప్ర‌మాణస్వీకారం చేసి ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో త్రిష తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. అమె క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అయ్యాయి.

Updated Date - May 11 , 2026 | 08:15 AM