Vijay Sethupathi: సీఎంగారు దయచేసి ఆ రెండు చేయండి..

ABN , Publish Date - May 25 , 2026 | 01:58 PM

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ముఖ్య మంత్రి విజయ్‌ను ఓ కోరిక కోరారు.

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ముఖ్య మంత్రి విజయ్‌ను ఓ కోరిక కోరారు. విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamla Haasan) విజ్ఞప్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను (OTT) ప్రారంభిస్తే సినిమా పరిశ్రమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం విజయ్‌ను సేతుపతి కోరారు.

‘సడెన్‌గా డిజిటిల్‌ మీడియాను ఆక్రమించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ది కూడా అంతే వేగంగా జరిగింది. ప్రస్తుతం ఓటీటీ హవా కూడా తగ్గింది. దీంతో సినిమా పరిశ్రమ పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం థియేటర్స్‌లో సినిమాకు ఆదరణ తగ్గింది. సినిమా బతకాలంటే థియేటర్‌తోపాటు ఇలాంటి ఓ ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉండాలి. కొన్నేళ్ల క్రితంసినిమా టికెట్‌ ధరలను పెంచారు. మిగతా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు సినిమా టికెట్‌ ధరలను కూడా పెంచే దిశగా పరిశీలన చేయాలి’ అని విజయ్‌ సేతుపతి సీఎంను కోరారు.


తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన విజయ్‌ సేతుపతి ప్రస్తుతం తెలుగులో ‘స్లమ్‌డాగ్‌’ సినిమా చేస్తున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - May 25 , 2026 | 02:10 PM