సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'జన నాయగన్' ఎఫెక్ట్.. రిలీజ్ డేట్లు మార్చుకుంటున్న సినిమాలు!

ABN, Publish Date - Jul 10 , 2026 | 09:44 AM

విజయ్ 'జన నాయగన్' జూలై 24 విడుదల నేపథ్యంలో ఇమ్మోర్టల్, డీసీ, సిగ్మా సినిమాలు రిలీజ్ డేట్లు మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.

vijay

తమిళ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయకగన్' (Jana Nayagan) జూలై 24న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమలో మూవీస్‌ రిలీజ్ క్యాలెండర్ ఒక్కసారిగా మారిపోయింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాతో పోటీ పడకుండా ఉండేందుకు ఇప్పటికే పలువురు నిర్మాతలు ముందుగా ఫ్లాన్ చేసుకున్న‌ తమ చిత్రాల విడుదల తేదీలను మార్చుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో.. మొదటగా జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఇమ్మోర్టల్' (Immortal) జూలై 23న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ విడుదలను వాయిదా వేశారు. ఈ చిత్రానికి కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు. అలాగే స్టార్‌ డైరెక్ట‌ర్‌ లోకేశ్ క‌న‌గ‌రాజ్‌ నటించిన 'డీసీ' (DC), సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిగ్మా (Sigma) సినిమాలు జూలై 31న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే 'జన నాయకగన్' ప్రభావంతో ఈ రెండు సినిమాలు కూడా తమ విడుదల తేదీలను మార్చుకునే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం మాత్రం 'అన్బే డయానా' (Anbe Diana) సినిమా జూలై 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. విజయ్ చివరి సినిమాగా వస్తున్న 'జన నాయకగన్'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద నేరుగా పోటీకి దిగడం కంటే విడుదల తేదీని మార్చుకోవడమే ఉత్తమమని పలువురు నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా జూలై చివరి వారంలో తమిళ సినిమా రిలీజ్ షెడ్యూల్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Jul 10 , 2026 | 10:00 AM