ఎనిమిది వేల స్క్రీన్లలో 'జన నాయగన్'
ABN , Publish Date - Jul 22 , 2026 | 07:31 AM
జన నాయగన్ చిత్రం విజయ్ అభిమానులకు కచ్చితంగా మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం అవుతుందని నిర్మాత వెంకట్ నారాయణ అన్నారు.
జన నాయగన్ (Jana Nayagan) చిత్రం విజయ్ అభిమానులకు కచ్చితంగా మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం అవుతుందని నిర్మాత వెంకట్ నారాయణ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనిమిదివేలకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇది విజయ్‌కు అభిమానులు ఇచ్చే ఒక గొప్ప గౌరవప్రదమైన కానుకలా ఉండేలా సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు నిర్మాత వెంకట్ కె.నా రాయణ. తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథా నాయకుడు విజయ్ హీరోగా హెచ్. వినోద్ ( H Vinoth) తెరకె క్కించిన చిత్రమిది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ (Venkat K Narayana) నిర్మించారు. సినిమా ఈనెల 23న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం
నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. అకడమిక్ పుస్తకాల్లో దొరకని ఎన్నో గొప్ప విషయాలు సినిమాల్లో ఉంటాయి. పాటలు, కథలు.. ఇవన్నీ మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. గొప్ప ఆలోచనలను సమాజానికి సినిమాల ద్వారానే బలంగా చెప్పొచ్చు. వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరో హించినప్పటికీ, సినీ రంగంలో కూడా ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను ఈ రంగంలోకి ప్రవే శించినప్పుడు కొవిడ్ మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. మా చుట్టుపక్కల సినీ పరిశ్ర మకు చెందిన వాళ్లు ఉండే వారు. వాళ్లతో మాట్లాడినప్పుడు ఎన్ని సినిమాలు ఆగిపోయాయో, ఎంతమంది ఉపాధి కోల్పోయారో తెలిసింది. అప్పుడే పరిశ్రమకు మనం కూడా ఏమైనా చేయాలని బలంగా అనుకున్నాను. ముందుగా ఫిల్మ్ ఫైనాన్స్, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్లోకి అడుగుపెట్టాం. రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్ సినిమాను కర్ణాటకలో పంపిణీ చేశాం.
'భగవంత్ కేసరి' స్ఫూర్తిగా..
'భగవంత్ కేసరి' సినిమా విజయ్కు చాలా నచ్చింది. నాకు కూడా చాలా ఇష్టం. ఆ చిత్రంలోని రెండు సన్నివేశాలను మాత్రమే స్పూర్తిగా తీసుకుని, మిగతా కథ అంతా కొత్త ప్రపంచంలో సాగేలా రూపొందించాం. అంతేకానీ 'భగవంత్ కేసరి'కి 'జన నాయగన్ రీమేక్ కాదు. ఓపెన్ మైండ్‌తో చూస్తే సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. భావోద్వేగ పరంగా కూడా ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం యువతను ఆలోచింపజేస్తుంది. వారికి ఒక ప్రేరణను కలిగిస్తుంది..
చిరంజీవితో సినిమా.. చాలా ఆనందంగా ఉంది
నాకు చిన్నప్పటినుంచీ చిరంజీవి అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు, ఆయన ప్రయాణం నాకు స్ఫూర్తి, అందుకే తెలుగులో నా తొలి సినిమాను చిరంజీవితోనే తీయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.