Ajith - Vijay: అన్నకు రేస్ కారు, తమ్ముడికి హెల్మెట్!
ABN, Publish Date - Sep 14 , 2026 | 06:05 PM
కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్ ఒకే చోట కలుసుకున్న అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్ ఒకే చోట కలుసుకున్న అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ప్రముఖ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌కు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ‘మిచెలిన్ లే మాన్స్’ కార్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ కుమార్ పాల్గొన్నారు. రేసింగ్ సూట్‌లో ఉన్న అజిత్‌ను విజయ్ చూసిన వెంటనే ఆయన వద్దకు వెళ్లి ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ సన్నివేశాన్ని అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అజిత్ రేసింగ్‌పై ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పాల్గొంటున్న రేసును ప్రోత్సహించేందుకు విజయ్ స్వయంగా అక్కడికి వెళ్లడం అభిమానులను ఆకట్టుకుంది. రేస్ ముగిసిన తర్వాత కూడా ఇద్దరూ కొంతసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు.
అంతేకాదు.. ఒకరికొకరు ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చుకోవడం మరో హైలైట్‌గా నిలిచింది.విజయ్ తన స్నేహితుడు అజిత్‌కు ఓ చిన్న రేసింగ్ కారు మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దానిపై ‘‘నా ప్రియమైన సోదరుడు అజిత్‌కు ప్రేమతో’’ అంటూ తన ఆటోగ్రాఫ్ చేయడం విశేషం. దీనికి ప్రతిగా అజిత్.. విజయ్‌కు హెల్మెట్‌ను బహుమతిగా అందించారు. ఇద్దరు స్టార్లు ఇలా గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.కోలీవుడ్‌లో విజయ్, అజిత్ ఇద్దరూ అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. దీంతో వీరి సినిమాల విడుదల సమయంలో అభిమానుల మధ్య పోటీ, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కనిపిస్తుంటాయి. అయితే తెరపై పోటీ ఉన్నా.. వ్యక్తిగతంగా తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే విషయాన్ని ఈ తాజా కలయికతో మరోసారి చూపించినట్లైంది.