జోస్యం చెప్పిన పూజా.. సిగ్గుపడ్డ విజయ్
ABN, Publish Date - May 05 , 2026 | 05:50 PM
తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ (Vijay) కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. టీవీకే పార్టీ ఊహించని విధంగా గెలిచి సంచలనం సృష్టించింది.
తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ (Vijay) కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే. టీవీకే పార్టీ ఊహించని విధంగా గెలిచి సంచలనం సృష్టించింది. ఇక విజయ్ గెలవడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం సంబురాలు చేసుకుంటుంది. ప్రతి ఒక్కరు విజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) సైతం తనదైన రీతిలో విజయ్ కి కంగ్రాట్స్ చెప్పింది. విజయ్ ఎన్నికల్లో గెలుస్తాడని తాను ముందే ఊహించినట్లు పూజా జోస్యం చెప్పుకొచ్చింది. దానికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది.
విజయ్, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం జన నాయగన్. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తుంది. జననాయగన్ సినిమా సెట్ లో పూజా, విజయ్ కలిసి చేసిన ఒక క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో.. ఒక బోర్టుపై ఈసారి ఎలక్షన్స్ లో గెలిచేది ఎవరు అని రాసి ఉండగా.. పూజా దాన్ని చూపిస్తూ.. సమాధానంగా విజయ్ వైపు చూపించింది. ఇక వెంటనే విజయ్ సిగ్గుపడుతూ కనిపించాడు.
వీడియోతో పాటు బుట్టబొమ్మ మంచి క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. 'జరిగేదాన్ని నేను ముందే ఊహించాను. కలలు నిజాలుగా మారినందుకు అభినందనలు, విజయ్ సర్ అంటూ తెలిపింది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో బీస్ట్ సినిమా వచ్చింది. కానీ, అది పరాజయంగా నిలిచింది. ఇప్పుడు జన నాయగన్ సినిమాతో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఈసారి హిట్ అందుకుంటారో లేదో చూడాలి.