Vijay: రావణుడిగా సీఎం విజయ్.. అమ్మవారిగా త్రిష..
ABN, Publish Date - Jul 22 , 2026 | 12:59 PM
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్(Vijay), హీరోయిన్ త్రిష (Trisha) పేర్లు కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్(Vijay), హీరోయిన్ త్రిష (Trisha) పేర్లు కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏం ఉందనేది అధికారికంగా తెలియకపోయిన రూమర్లు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళనాడులో వెలిసిన ఓ బ్యానర్ కొత్త వివాదానికి తెరతీసింది. సేలం జిల్లా ఆత్తూర్‌లోని మారియమ్మన్ ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా కొందరు యువకులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆ బ్యానర్‌లో సీఎం విజయ్‌ను పది తలల రావణాసురుడి రూపంలో, త్రిషను అమ్మవారి వేషధారణలో చిత్రీకరించారు.
ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల చిత్రాలను, అది కూడా ఇలాంటి రూపాల్లో ప్రదర్శించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్–త్రిషలపై వస్తున్న రూమర్ల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా ఈ బ్యానర్ పెట్టి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫ్లెక్స్ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో బ్యానర్‌ను తొలగించారు. దీనిని ఏర్పాటు చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.