బిచ్చగాడు కాంబో.. వంద దేవుళ్ళు!
ABN, Publish Date - Mar 21 , 2026 | 12:24 PM
'బిచ్చగాడు' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడు శశి, హీరో విజయ్ ఆంటోనీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి 'వంద దేవుళ్ళు' అనే పేరు ఖరారు చేశారు.
‘పిచ్కైకారన్’ (బిచ్చగాడు) వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత దర్శకుడు శశి, హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘నూరు సామి’ (Noorusaami) తెలుగులో 'వంద దేవుళ్ళు' (Vanda Devullu) అనే పేరు ఖరారు చేశారు.
చెరకు రైతుల జీవితాన్ని ప్రధాన కథాంశంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, తాజాగా మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. వేసవి సెలవుల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ‘పూ’ సినిమా తర్వాత దర్శకుడు శశి రూపొందించిన గ్రామీణ నేపథ్యంతో కూడిన చిత్రం ఇది.
ఇందులో చెరకుకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో చక్కెర కర్మాగారాలకు చౌక ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో చక్కెర ఫ్యాక్టరీల, కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని వివరించేలా చిత్రం స్క్రీన్‌ప్లే సాగుతుందని దర్శకుడు శశి చెప్పారు. ఇందులో చెరకు రైతుగా విజయ్ ఆంటోనీ, ఆయన భార్యగా శ్వాసిక నటించారు.
‘రక్తం, చెమట, బంధంతో కూడిన ప్రయాణం. ఇదే మనం జీవించే జీవితం’ అంటూ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన తర్వాత విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అజయ్ కిషన్, కరుణాస్, లిజో మోల్ జోస్, కావ్య అనిల్ తదితరులు నటించగా, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.