‘నాన్న కుట్టి’.. విజయ్ ఆంటోనీ యాక్షన్ చూస్తారా?

ABN , Publish Date - May 23 , 2026 | 03:33 PM

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పుడిదే సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా ఓ చిత్రం రాబోతోంది.

Vijay Antony Nanna Kutty Update

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పుడిదే సెంటిమెంట్‌తో ము. మారన్ (Mu. Maran) దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటించిన చిత్రం ‘నాన్న కుట్టి’ (Nanna Kutty). యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై.. మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తోన్న ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామాంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ తెలియజేశారు.


ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. అంతేకాదు, ఆగస్టులో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్నట్లుగా కూడా ప్రకటించారు. ఇందులో ఫుల్ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారని, ఈ కథ తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని హైలైట్ చేస్తూ యాక్షన్ ప్రధానంగా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ చెబుతున్నారు.


తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ ఆంటోని కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్‌గా ఉండబోతున్నాయనేది అర్థమవుతోంది. యాక్షన్‌కు సంబంధించిన స్టిల్ ఇదని.. ఆయన ఫేస్‌లో పై ఉన్న రక్తపు మరకలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్ని పోషించిన ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Updated Date - May 23 , 2026 | 03:33 PM