S. P Venkatesh: సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ కన్నుమూత
ABN, Publish Date - Feb 04 , 2026 | 08:25 AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ సంగీత దర్శకుడు (music director) ఎస్పీ వెంకటేశ్(70) (S. P. Venkatesh) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు చెన్నైలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంకటేశ్ 1971లో గిటారిస్ట్ గా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రముఖ సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశారు. అనుభవం సంపాదించిన తర్వాత స్వతంత్ర సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ తదితర భాషల్లో 250కి పైగా చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఆయన తనదైన ముద్ర వేశారు.