అసభ్యకర కంటెంట్.. నటి దర్షా గుప్తా, పలువురు ఇన్‌ఫ్లూయన్సర్స్‌పై కేసులు
ABN, Publish Date - Aug 31 , 2026 | 07:45 AM
గ్లామర్ నటి దర్జా గుప్తాతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై సేలం జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్లామర్ నటి దర్జా గుప్తా (Dharsha Gupta) తో పాటు మరికొందరిపై సేలం (Salem)జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) కేసులు నమోదు చేశారు. సేలంకు చెందిన అజిత్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. 'దర్జా గుప్తా, తిరుచ్చి సాదన (Trichy sathana), సూర్య ప్రభ, హనీ చెన్నై, అభినయ చిత్ర (Abinaya Palanisamy), ప్రియాంకా రాజ్ (Priyanka Raj), శరణ్య, యూట్యూబ్‌లో ఐశ్వర్య శివ, దివి తిలగవతి (Divi Thilagam Sri), దీపా కరూర్, సింద్ శేఖర్ వంటి పలువురు సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ 18 యేళ్ళలోపు యువతీ యువకులకు హాని కలిగే విధంగా పోస్టులు పెడుతున్నారని, కొన్ని అసభ్యకర వీడియోలు షేర్ చేస్తున్నారని, అందువల్ల వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.