విజయ్ గెలుపు.. ఆలస్యంగా తమిళ స్టార్ల స్పందన
ABN, Publish Date - May 04 , 2026 | 09:05 PM
విజయ్, ఆయన స్థాపించిన టీవీకే పార్టీతో తాజా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సంచలన విజయం సాధించి దేశ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు.
టీవీకే విజయ్ తాజా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సంచలన విజయం సాధించి దేశ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సర్వత్రా ఎక్కడ చూసినా అంతా విజయ్ ఆయన విజయం గురించే విరివిగా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికే తెలుగు నుంచి నాని తొలిసారిగా విజయ్‌కు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించగా ఆపై టాలీవుడ్ టాప్ స్టార్లు అంతా తమ విషెష్ తెలియజేశారు.
అయితే సొంత రాష్ట్ర తమిళనాడు నుంచి మాత్రం స్టార్ హీరోలు ఆలస్యంగా మెల్కోన్నారు. తెలుగు నటులు మధ్యాహ్నం నుంచే విజయ్‌కి గ్రీటింగ్స్ చెప్పడం ప్రారంభించగా కొలీవుడ్ స్టార్స్ మాత్రం రాత్రి 8 గంటల నుంచి శుభాకాంక్షలు తెలుపడం సందేహాలు తావిచ్చింది.
స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హసన్, సూర్య, విక్రమ్, ధనుష్, శివ కార్తికేయన్, విశాల్, కార్తీ, జయం రవి, నయనతార, కాజల్ అగర్వాల్, శింబు, విజయ్ అంటోని, జీవా వంటి వారు తమ తమ శైలిలో విజయ్‌కి శుభాకాంక్షలు తెలియజేసి ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన పోస్టులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.