సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhanush Vs Vijay: ధనుష్‌పై.. విజ‌య్‌ సర్కారు నిఘా

ABN, Publish Date - Aug 12 , 2026 | 11:41 AM

హీరో ధనుష్ రాజకీయ కార్యకలాపాలపై టీవీకే ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం.

dhanush vijay

హీరో ధనుష్ (Dhanush) చర్యలపై విజ‌య్ టీవీకే (TVK)ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర నిఘా వర్గాలు అందించిన నివేదికతో అప్రమత్తమైన సర్కారు ధనుష్, ఆయన అభిమాన సంఘాలు చేపట్టే సంక్షేమ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి నిఘా వర్గాలు అందించిన నివేదిక మేరకు.. హీరో ధనుష్ యువతను లక్ష్యంగా చేసుకుని, ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకు టికే కోవై జిల్లాలోని పది నిజయోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రారంబించారు.

నియోజకవర్గాల వారీగా చేపట్టే ఈ సభ్యత్వ నమోదును రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తన అభిమానులను ఆదేశించినట్టు నిఘా వర్గాల నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా ధనుష్ చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్‌లో టీవీకే సర్కారుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని, అందువల్ల ధనుష్ కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిం చాలని సీఎం విజయ్ ఆదేశించినట్టు వినికిడి.

ఇందుకోసం నిఘా విభాగంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని, ఈ బృందం ధనుష్ సహా ఇతర నటుల అభిమాన సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించి నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే, సీఎం విజయ్ వ్యక్తిగత కార్యదర్శి జగదీష్ పర్యవేక్షణలో ధనుష్‌కు చెందిన సోషల్ మీడియా పోస్టులపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం.

Updated Date - Aug 12 , 2026 | 11:51 AM