సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అడ్డంగా దొరికిపోయిన.. విజ‌య్‌, త్రిష‌! ఆ రూమ‌ర్స్.. నిజ‌మేనా

ABN, Publish Date - Mar 05 , 2026 | 10:02 PM

ఇటీవ‌ల తెలుగు నాట సినిమా న‌టుల పెళ్లిళ్ల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడుతుంటే.. మ‌రో వైపు త‌మిళ‌నాట విడాకుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.

trisha

ఇటీవ‌ల తెలుగు నాట సినిమా న‌టుల పెళ్లిళ్ల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడుతుంటే.. మ‌రో వైపు త‌మిళ‌నాట విడాకుల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ఏడాదికొకరు చొప్పున అక్క‌డి స్టార్ హీరోలు వివాహ బంధానికి గుడ్ బై చెబుతూ నిత్యం య‌వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే కొలీవుడ్‌లో జీవీ ప్ర‌కాశ్ కుమార్‌, ధ‌నుష్, ర‌వి మోహ‌న్ వంటి వారు త‌మ భార్య‌ల‌కు విడాకులు ఇవ్వ‌గా ఇప్పుడు ఆ కోవ‌లోకి త‌ల‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) చేరిపోయాడు.

ఇటీవ‌లే విజ‌య్ భార్య సంగీత కోర్టు మెట్టు ఎక్క‌డంతో ఈ అంశం తెర మీద‌కు వ‌చ్చింది. ఆపై భార్య‌తో విడాకుల వ్య‌వ‌హారం పూర్తి చేసుకునేందుకు దాదాపు రూ.250 కోట్లు భ‌ర‌ణం సైతం ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు విజ‌య్‌ సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లో తీరిక లేకుండా ఉండ‌గా ఇటీవ‌ల ఈ విడాకుల విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి ఆయ‌న‌కు తీవ్ర‌ స‌మ‌స్య‌లు తెచ్చిపెట్టింది. అధికార, ప్ర‌తిప‌క్షాలు సైతం ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు, ట్రోలింగ్ చేస్తున్నాయి. దీంతో విజ‌య్‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చాయి. ఆయ‌న‌ను ఫాలో అవుతున్న వారు సైతం ఏం చేయాలో దిక్కులేని ప‌రిస్థితుల్లో చిక్కుకున్నారు. అంతేగాక న‌టి త్రిష (Trisha ) తో ఎఫైర్ ఉంద‌నే న్యూస్ సైతం బాగా హ‌ల్చ‌ల్ చేస్తోంది.

అయితే.. ఓ వైపు ఈ వార్త‌లు ఇలా వ‌స్తుండ‌గానే తాజాగా చెన్నైలో ప్ర‌ముఖ నిర్మాత క‌ళైపులి సురేశ్ (Kalpathi S Suresh) కుమారుడి వివాహా రిసెప్ష‌న్‌కు విజ‌య్ త్రిష‌తో క‌లిసి హ‌జ‌ర‌య్యారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే త్రిష‌తో సంబంధాల విష‌యంలో వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా ఉన్న స‌మ‌యంలో ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి ఒక కారులో రిసెప్ష‌న్‌కు రావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అంతేగాక ప్ర‌స్తుతం త్రిష‌, విజ‌య్‌ల న‌డుమ వ‌స్తున్న వార్త‌లు నిజం అన‌డానికి ఈ వీడియోనే సాకక్ష్య‌మ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 10:22 PM