సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

త్రిషకు 12 కోట్ల ఆఫర్ ఇచ్చిన సీఎం విజయ్ శత్రువు.. ఆమె ఏం చేసిందంటే

ABN, Publish Date - May 16 , 2026 | 04:39 PM

అందాల భామ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) రూ. 12 కోట్ల ఆఫర్ ని వదులుకుందా అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. కేవలం విజయ్ (Vijay) కోసం మాత్రమే ఆమె ఈ డీల్ ని నిరాకరించిందని కోలీవుడ్ కోడై కూస్తోంది.

Trisha Krishnan

అందాల భామ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) రూ. 12 కోట్ల ఆఫర్ ని వదులుకుందా అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. కేవలం విజయ్ (Vijay) కోసం మాత్రమే ఆమె ఈ డీల్ ని నిరాకరించిందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అసలు విషయం ఏంటి అంటే. వరుస పరాజయాలు అందుకుంటున్నా త్రిషకు మాత్రం అవకాశాలు దండిగానే వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో విశ్వంభర సినిమాలో నటిస్తోన్న త్రిషకు తలైవర్ 174లో నటించే ఛాన్స్ దక్కింది.


సూపర్ స్టార్ రజినీకాంత్ , లోకనాయకుడు కమల్ హాసన్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న చిత్రం తలైవర్ 174. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ ని హీరోయిన్ గా అనుకున్నారట. కథ చెప్పడానికి డైరెక్టర్ వెళ్తే త్రిష సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. చివరకు రూ. 12 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామన్న కూడా ఆమె ఒప్పుకోలేదట. అందుకు కారణం ఈ సినిమాను రెడ్ జెయింట్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు.


ప్రస్తుతం సీఎం విజయ్ కి ప్రత్యర్థి నాయకుడు ఉదయనిధి స్టాలిన్. వీరిద్దరి మధ్య కొన్నిరోజులుగా వైరం నడుస్తున్న విషయం తెల్సింద. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న చిత్రంలో త్రిష నటిస్తే.. విజయ్ శత్రువుతో చేతులు కలిపినట్లే అని భావించి త్రిష ఈ ఆఫర్ ని తిరస్కరించిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ.. త్రిష చేసిన పని మాత్రం మంచిదే అని విజయ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - May 16 , 2026 | 05:30 PM