విజయ్‌తో చెట్టాపట్టాల్.. మీడియా ప్రశ్నకు త్రిష మౌనం
ABN, Publish Date - Mar 14 , 2026 | 08:00 AM
విజయ్ తో చెట్టాపట్టాలేసుకు తిరగడంపై మీడియా అడిగిన ప్రశ్నకు నటి త్రిష బదులు ఇవ్వకుండా మౌనం దాల్చారు.
తమిళ స్టార్ హీరో, 'తమిళగ వెట్రి కళగం' అధినేత విజయ్ (Vijay) తో చెట్టాపట్టాలేసుకు తిరగడంపై మీడియా అడిగిన ప్రశ్నకు నటి త్రిష (Trisha Krishnan) బదులు ఇవ్వకుండా మౌనం దాల్చారు. విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో విజయ్ నటి త్రిషతో కలిసి నగరంలో జరిగిన ఓ వివాహ వేడుకకు ఒకే రంగు దుస్తులు ధరించి హాజరయ్యారు.
ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ముంబాయి వెళ్లటానికి త్రిష మీనంబాక్కం విమానాశ్రయానికి రాగా విలేకరులు ఆమెను చుట్టుముట్టి 'విజయ్, మీరు కలిసి ఓ వివాహానికి వెళ్లటం చర్చనీయాంశంగా మారడం పై మీ అభిప్రాయమేంటి' అని ప్రశ్నించారు. అప్పటి దాకా నవ్వుతూ వెళ్ళిన త్రిష. విలేకరులు అడిగిన ప్రశ్నతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే ఆమె విమానాశ్రయంలోకి వెళ్ళిపోయారు.