సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Toxic; డేట్‌ వచ్చేసింది.. ఇక టాక్సిక్‌ జాతరే

ABN, Publish Date - Jun 21 , 2026 | 01:27 PM

కన్నడ స్టార్‌ యశ్‌ (yash) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌’(toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడింది. ఫాదర్స్‌ డేను పురస్కరించుకుని కొత్త రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు.

కన్నడ స్టార్‌ యశ్‌ (yash) హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్‌’(toxic) గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదాపడింది. ఫాదర్స్‌ డేను పురస్కరించుకుని కొత్త రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఆగస్ట్‌ 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెబుతూ కొత్త పోస్టరు విడుదల చేశారు. యాక్షన్‌, ఎమోషన్‌, స్టైలిష్‌ విజువల్స్‌తో ఈ చిత్రం రాబోతోందని, ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో యశ్‌ కనిపించనున్నారని దర్శకురాలు గీతూ ఇప్పటికే చెప్పారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయనున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మాణంలో కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్‌ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి కీలక పాత్రఽధారులు. రవిబస్రూర్‌, తనిష్క్‌ బగ్చి, విశాల్‌ మిశ్రా సంగీతం అందిస్తున్నారు.

ALSO READ:

Buchi Babu Sana: చిరంజీవి గారింట్లో నేషనల్‌ అవార్డు చూడాలనేది నా కోరిక

Fathers Day: చూడటానికి నాన్న అక్కడే ఉండిపోతాడు

అమ్మాయి బ్రేకప్పు.. అబ్బాయి ఓదార్పు.. మణిశర్మ మ్యాజిక్కు



Updated Date - Jun 21 , 2026 | 02:10 PM