సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అవి రిలీజ్ కావ‌డం లేదు.. ఇవి స్టార్ట్ అవ‌డం లేదు! అయోమ‌యంలో.. భారీ నిర్మాత‌

ABN, Publish Date - Apr 16 , 2026 | 06:34 AM

టాక్సిక్‌ సినిమాను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదనేది చిత్ర పరిశ్రమలో విన్పిస్తున్న మాట.

Toxic

Toxic Release-ent-chaitanya

రాఖీ భాయ్‌ నిర్మాతలను గట్టెక్కిస్తాడా..?

కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన యశ్, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో నటిస్తున్న టాక్సిక్‌ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదనేది చిత్ర పరిశ్రమలో విన్పిస్తున్న మాట. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ల్లో వరుసగా ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఈ రేసులో విజయ్‌ నటించిన ఆఖరి చిత్రం జననాయగన్‌ ముందు వరుసలో ఉంది. ఈ చిత్రం ఎప్పుడో సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ కావాల్సి ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినా, ఇప్పటికీ సెన్సార్‌ బోర్డు నుంచి అనుమతులు రాకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి తోడు, సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం నిర్మాతలను కోలుకోలేని దెబ్బ తీసింది. సినిమాపై ఆసక్తి తగ్గడమే కాకుండా, బిజినెస్ పరంగా కూడా ఇది నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తోంది.

స్పాట్; మాంటేజ్‌

కన్నడ బాక్సాఫీస్ సుల్తాన్ యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్, అనుకోని రాజకీయ పరిణామాల వల్ల బ్రేక్ పడటంతో నిర్మాతలు డైలమాలో పడ్డారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, గ్రాఫిక్స్ అలాగే ఎడిటింగ్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో టాక్సిక్ జూన్ 4న విడుదల కావడం అసాధ్యమంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నెగిటివ్ ప్రచారం కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై మరింత ఒత్తిడి పెంచింది. అయితే, చిత్ర యూనిట్ ఈ ఊహాగానాలకు తెరదించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడం ఖాయమని స్పష్టం చేసింది. యశ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను సిద్ధం చేస్తున్నారు.

స్పాట్; మాంటేజ్‌

కేవీఎన్ ప్రొడక్షన్స్ లైనప్‌లో మరిన్ని భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే జననాయగన్ చిక్కులు, టాక్సిక్ వాయిదాల ప్రభావం ఆ సినిమాలపై పడుతోంది. కొత్తగా పట్టాలెక్కాల్సిన ప్రాజెక్టులు నిరంతరం వాయిదా పడుతూ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, టాక్సిక్ ఫలితమే ఈ నిర్మాణ సంస్థ భవిష్యత్తును నిర్ణయించనుంది. యశ్ తన మాస్ పవర్‌తో ఈ సినిమాను గట్టెక్కిస్తేనే, మిగతా ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అవుతుంది. సినిమా రంగంలో గెలుపోటములు సహజమే అయినా, ఇలాంటి గడ్డు కాలంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు, యశ్ మీద పెట్టుకున్న నమ్మకం ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.

స్పాట్; మాంటేజ్‌

Updated Date - Apr 16 , 2026 | 06:56 AM