Mogudu: గోపీచంద్ టైటిల్ తో వస్తున్న విశాల్.. గ్లింప్స్ అదిరిపోయిందంతే
ABN, Publish Date - Jan 21 , 2026 | 08:30 PM
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal), డైరెక్టర్ సుందర్ సి (Sundar C) ది హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి.
Mogudu: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal), డైరెక్టర్ సుందర్ సి (Sundar C) ది హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. మగ మహారాజు, మదగజరాజా, యాక్షన్. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది. తాజాగా విశాల్.. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో విశాల్ సరసన తమన్నా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
విశాల్ 36వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొగుడు అనే టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ కూడా చాలా వినోదాత్మకంగా కట్ చేశారు. తమన్నా భార్యగా.. విశాల్ భర్తగా కనిపించనున్నారు. ఇంట్లో సీరియల్ చూస్తున్న భార్య.. పనులు చేస్తున్న భర్తను తిడుతూ ఉంటుంది. అప్పుడే సీరియల్ హీరో ఇంటికి రావడం, అతనిని చూసి నేర్చుకోవాలని భర్తను తిట్టి.. కాఫీ పెట్టమని వంటగదిలోకి పంపిస్తుంది. అప్పుడే కొంతమంది రౌడీలు ఇంట్లోకి రావడం, భార్యకు తెలియకుండా వారిని భర్త చితక్కొట్టడం చూపించారు. ఇక ఇదంతా చూసిన సీరియల్ హీరో.. మొగుడిగా ఉండడం ముఖ్యం కాదు.. మొగుడు ఓర్పుగా ఉండడం ముఖ్యం అని డైలాగ్ చెప్పడంతో మొగుడు అనే టైటిల్ కార్డు పడడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ గ్లింప్స్ కి హైలైట్ మాత్రం హిప్ హాఫ్ తమిళ్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
మొగుడు అనే టైటిల్ తో ఇప్పటికే తెలుగులో ఒక సినిమా వచ్చింది. గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు విశాల్.. ఆ టైటిల్ తో రాబోతున్నాడు. ఆ కథకు.. ఈ కథకు ఎలాంటి పోలిక లేకపోవడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ హైప్ పెట్టుకున్నారు. భార్య ముందు తలవంచే భర్త.. బయట ఎలా ఉంటాడు.. ? ఎలాంటి పనులు చేస్తాడు.. ? అనేది ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈసారి సుందర్ సి- విశాల్ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.