సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భార్యతో విజయ్ డీల్.. 250 కోట్లతో సెటిల్మెంట్

ABN, Publish Date - Mar 04 , 2026 | 09:11 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)విడాకుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. విజయ్ భార్య సంగీత తనకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెల్సిందే.

Vijay

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)విడాకుల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. విజయ్ భార్య సంగీత తనకు విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెల్సిందే. విజయ్ కి ఒక నటితో సంబంధం ఉందని, రెండేళ్లుగా తామిద్దరం విడిగా ఉంటున్నామని, తనకు తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు విజయ్ తన విడాకుల విషయమై స్పందించింది లేదు.

ఇంకోపక్క విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సైతం తండ్రిని దూరం పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ లో తండ్రిని అన్ ఫాలో చేశాడు. దీంతో విజయ్ పేరు కోలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. విజయ్ ఎఫేరి పెట్టుకున్నది హీరోయిన్ త్రిషతోనే అని నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్, త్రిష పెట్టిన పోస్టులు ఇలా ప్రతిదీ బయటకు తీసి వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని నిరూపించే పనిలో ఉన్నారు.ఈ ఒక్క వార్త విజయ్ రాజకీయ భవిష్యత్ ను గందరగోళంలో పడేసింది. ఇంట్లో భార్యనే సరిగ్గా చూసుకోలేనివాడు.. రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు అని ప్రత్యర్థులు ఏకిపారేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సంగీతతో మాట్లాడి ఎలాంటి గొడవలు లేకుండా మ్యూచువల్ డివోర్స్ వచ్చే విధంగా సెటిల్మెంట్ చేయనున్నట్లు టాక్. దానికోసం సంగీతకు విజయ్.. రూ. 250 కోట్లు ఆఫర్ చేసినట్లు కోలీవుడ్ మీడియా మాట్లాడుతోంది. సంగీత, తన పిల్లలు బ్రతకడానికి కావాల్సిన డబ్బును ఆమెకు ఇచ్చి.. పరస్పర ఇష్టంతో విడాకులు తీసుకోవాలని, ఇవన్నీ బయటకు రాకుండా వెంటనే ముగించాలని విజయ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 04 , 2026 | 09:36 PM