తమిళ సినిమాలోకి .. హీరోయిన్‌గా తెలుగమ్మాయి
ABN, Publish Date - Oct 13 , 2026 | 04:23 PM
పూజిత పొన్నాడ కోలీవుడ్ ఎంట్రీ మూవీ ‘సిగ్నల్ ఎట్ 11:30’ అక్టోబర్ 30న విడుదల కానుంది. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సంతోష్ ప్రతాప్ హీరోగా నటించారు.
తమిళ వెండితెరకు మరో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్నారు. మలర్ విళి నటేశన్ కథను సమకూర్చి దర్శకత్వం వహించిన 'సిగ్నల్ ఎట్ 11:30 (Signal At 11:30) అనే చిత్రం ద్వారా టాలీవుడ్ నటి పూజిత పొన్నాడ (Pujita Ponnada) కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని అలర్ స్టూడియోస్ పతాకంపై మలర్ విళి నటేశన్, శివానీ సుబ్రమణి సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 30న విడుదలకానున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, సంతోష్ ప్రతాప్, భవ్య త్రిఖ, మునీష్ కాంత్, జయప్రకాష్ తదితరులు నటించారు.
కోలీవుడ్‌లో ఎంట్రీపై పూజిత మాట్లాడుతూ, 'సాధారణంగా కథ విన్న తర్వాత ఓకే చెప్పడానికి కొంత సమయం పడుతుంది. కానీ, ఈ సినిమా స్టోరీ వినగానే అంగీకరించాను. ఒక అమ్మాయి కథ రాసేసమయంలో మహిళా పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. దర్శకురాలు మలర్విళి నటేశన్ ఈ స్టోరీ చెప్పినపుడు నా పాత్రను అద్భుతంగా వర్ణించారు. నేను ఇప్పటివరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ఈ పాత్రవుంది.
సాధారణంగా నిజ జీవితంలో రాత్రి పూట కారు డ్రైవింగ్ చేయడమంటే నాకు చాలా భయం. కానీ, ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక సన్ని వేశంలో కారు నడపాల్సి వుంది. ఆ నటించేందుకు చాలా భయపడ్డాను. దర్శకురాలి సపోర్టు, రాత్రిపూట ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటంతో ఆ సన్నివేశంలో నటించేందుకు అంగీకరిం చాను. సిగ్నల్ ఎట్ 11:30 మూవీలోని ప్రేమ సన్నివే శాలను అందమైన కొండ ప్రాంతాల్లో చిత్రీకరించారు. సంతోష్ ప్రతాప్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆలరిస్తుంది. కోలీవుడ్లో నాకు మంచి ఎంట్రీ అవుతుంది' అని పేర్కొన్నారు.