Komalee Prasad: తమిళంలోకి.. మరో తెలుగు భామ
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:03 PM
తెలుగు భామ కోమలి ప్రసాద్ తమిళంలో ఫీమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండవెట్టి’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది.
మరో తెలుగమ్మాయి తమిళ సినిమాల్లోకి అరంగేట్రం చేస్తోంది. ఇప్పటివరకు కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నెపోలియన్, రౌడీ బాయ్స్, సెబాస్టియన్ P.C. 524, హిట్ సెకండ్ కేస్, హిట్ థర్డ్ కేస్, శశివదనే వంటి చిత్రాలు, లూజర్, మోడర్న్ లవ్ హైదరాబాద్, టచ్ మీ నాట్ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోమలి ప్రసాద్ (Komalee Prasad) తన సినీ కెరీర్‌లో మరో కీలక అడుగు వేస్తూ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ‘మండవెట్టి’ (mandavetti) చిత్రం గురువారం గ్రాండ్‌గా ప్రారంభమైంది.
టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై గతంలో ‘వెల్ల కుదిర’ వంటి సెన్సిబుల్, సైకాలాజికల్ చిత్రంతో ప్రశంసలు అందుకున్న శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా కోమలి మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇది ఓ కొత్త గొప్ప అవకాశమని.. ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు తనకు ఎప్పటిలాగే అవసరమని తెలిపింది. కాగా ఇటీవల పూజా కార్యక్రమాలతో అధికారికంగా షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. తేనప్పన్, గజరాజ్, అమృత తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.