సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగు ఫోక్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ.. త‌మిళ‌ సినిమా టీజ‌ర్‌ వ‌చ్చేసింది

ABN, Publish Date - Jun 17 , 2026 | 10:09 AM

ప్ర‌ముఖ తెలుగు ఫోక్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ (Naga Durga) క‌లివి వ‌నం అనే సినిమాతో తెరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే.

Naga Durga

ప్ర‌ముఖ తెలుగు ఫోక్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ (Naga Durga) క‌లివి వ‌నం అనే సినిమాతో తెరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఆపై త‌మిళం నుంచి సైతం ఓ క్ఏజీ ఛాన్స్ ద‌క్కించుకుంది. స్టార్ హీరో ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌విశ్‌ నారాయణ్ (Pavish Narayan) హీరోగా మహేశ్ రాజేంద్రన్ (Magesh Rajendran) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ల‌వ్ ఓ ల‌వ్ (Love Oh Love) అనే ఓ చిత్రంలో క‌థానాయిక‌గా చేస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం టీజ‌ర్ రిలీజ్ చేశారు.

ఇటీవలికాలంలో వయసుతో సంబంధం లేకుండా. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వచ్చిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ కోవ‌లోనే లవ్, రొమాన్స్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, కేఎస్.రవికు మార్, వనిత, రమ్య, ఆదిత్య, కదిర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన ఈ టీజర్ 80 సెకన్ల నిడివి ఉండగా.. ప్రేమ, హాస్యం, యూత్‌ఫుల్ స‌న్నివేశాల‌తో ఆస‌క్తిక‌రంగా స‌న్నివేశాల‌తో తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా సెల్వరాఘవన్ పోషించిన పాత్ర అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది. నాగ‌దుర్గ కొన్ని స‌న్నివేశాల‌లో త‌ప్పా మిగ‌తా సీన్ల‌లో బాగానే న‌టించింది.

Updated Date - Jun 17 , 2026 | 10:13 AM