Cm Vijay: మూడు రోజుల్లో తేలనున్న.. సీఎం విజయ్, సంగీత విడాకుల కేసు
ABN, Publish Date - Jun 12 , 2026 | 06:37 AM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో జూన్ 15న కేసు విచారణ జరగనుంది.
ముఖ్యమంత్రి విజయ్ (cm vijay) భార్య సంగీత (sangeetha) విడాకుల రద్దు కేసు ఈ నెల 15, సోమవారం చెంగల్పట్టు జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో విచారణకు రానుంది. నటుడు, టీవీకే అధ్య క్షుడు విజయ్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో, విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత దాఖలుచేసిన కేసు, సోమవారం విచారణకు రానుంది.
ఈ కేసు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి విజయ్ కోర్టుకు హాజరయ్యే అవకాశం లేదని ఆయన తరపున చెబుతుండగా, సంగీత హాజరయ్యే అవకాశముందని ఆమె తరపున తెలియజేశారు. అదే సమయంలో, ఇద్దరు తమ తమ న్యాయవాదుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశముందని సమాచారం.