సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Cm Vijay: టికెట్ తీసుకుని.. మెట్రోలో విజ‌య్ ప్ర‌యాణం

ABN, Publish Date - Jul 30 , 2026 | 10:57 AM

తమిళనాడు సీఎం విజయ్ చెన్నై మెట్రో ప్రాజెక్ట్-2 పనులను పరిశీలించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి సాధారణ ప్రయాణికులతో కలిసి మెట్రోలో ప్రయాణించడం ఆకట్టుకుంది.

CM Vijay

చెన్నై కత్తిపారా (Kathipara)జంక్షన్‌లో నూత‌నంగా చేపట్టిన మెట్రోరైల్ పనులను త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి విజయ్ (Chief Minister Vijay) బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. నెలరోజులుగా శాఖల వారీగా ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతూ, ఆయా శాఖలు చేపట్టిన పథకాలు, మౌలిక వసతుల కల్పన తదితరాలపై చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం నందనంలోని సీఎంఆర్ఎల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ముఖ్య మంత్రి విజయ్.. మెట్రో రైలు ప్రాజెక్ట్- 2 చేపడుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఇందు కోసం, గవర్నమెంట్ ఎస్టేట్ రైల్వే స్టేషన్ నుంచి నందనం వరకు మెట్రోరైలులో ముఖ్యమంత్రి ప్రయాణించారు. నందనం సీఎంఆర్ఎల్ ప్రధాన కార్యాలయంలో పర్యటించిన అనంతరం ముఖ్య మంత్రి విజయ్.. కారులో గిండి కత్తిపార ఫ్లైఓవర్ ప్రాంతానికి చేరుకుని, మెట్రోరైలు నిర్మాణాలను ద‌గ్గ‌రుండి పరిశీలించారు.

అక్కడి నుంచి కారులో పోరూర్ మెట్రో రైల్వేస్టేషన్‌కు వెళ్లిన సీఎం.. డ్రైవర్ రహిత మెట్రోరైలులో పూందమల్లి వరకు ప్రయాణించి, పనులు పరిశీలించారు. ముఖ్యమంత్రి వస్తున్నన్నారని తెలియడంతో నందనం, గిండి ప్రాంతాల్లో టీవీకే కార్యకర్త‌లు అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో గుమి గూడారు. రైల్వేస్టేషన్ లోని కౌంటర్ వద్ద ముఖ్య మంత్రి విజయ్ నగదు చెల్లించి టిక్కెట్టు తీసుకోవడం, అక్కడి సిబ్బందితోను, మెట్రోరైలులో ప్రయా ణికుల మధ్య కూర్చొని ప్రయాణించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Updated Date - Jul 30 , 2026 | 10:57 AM