త్వరలోనే అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి.. ఎవరు చెప్పారంటే

ABN , Publish Date - Jun 28 , 2026 | 08:31 PM

మరోసారి ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీమ్ సిఈఓ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ల పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఓ సీనియర్ నటుడు కావడం విశేషం.

Anirudh Ravichander and Kaviya Maran

మరోసారి ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీమ్ (SRH Team) సిఈఓ కావ్య మారన్ (Kaviya Maran), సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌ (Anirudh Ravichander)ల పెళ్లికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు వీరిద్దరి పెళ్లి అంటూ వచ్చిన వార్తలను అనిరుధ్ ఖండించిన విషయం తెలిసిందే. కానీ, ఈసారి ఏకంగా ఓ సీనియర్ నటుడు, అందులోనూ అనిరుధ్‌కు చాలా దగ్గర బంధువు అయిన వైజీ మహేంద్రన్ చెప్పడంతో.. త్వరలోనే అనిరుధ్, కావ్యల పెళ్లి జరగనుందంటూ సోషల్ మీడియా అంతా టామ్ టామ్ అవుతోంది. అసలు వైజీ మహేంద్రన్ ఏమన్నారంటే..


‘‘అనిరుధ్ రవిచందర్ చాలా మృదుస్వభావి. నాకు తెలిసినంత వరకు వాళ్లిద్దరూ (కావ్య, అనిరుధ్) పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అమ్మాయి సాధారణ వ్యక్తి కాదు. అంత పెద్ద టీమ్ (SRH)ను నిర్వహించగల సామర్థ్యం ఆమెకు ఉంది. తండ్రి వ్యాపార నైపుణ్యాలు ఆమె పుణికి పుచ్చుకుంది. ఇద్దరూ మంచి జోడీ. వారిద్దరూ కలిసి మ్యూజిక్ రంగంలో కూడా రాణించగలరు’’ అని వైజీ మహేంద్రన్ తన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతే ఒక్కసారిగా ఈ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


నిజంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తున్నట్లుగా అయితే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా అనిరుధ్ బంధువు నోటి వెంటే ఈ విషయం రావడంతో.. డౌటే లేదు, త్వరలోనే వారి పెళ్లికి సంబంధించి ప్రకటన రానుందంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు హడావుడి చేస్తున్నారు. ‘అనిరుధ్ పెట్టి పుట్టాడు.. సన్ గ్రూప్‌కు, కళానిధి మారన్‌కు అల్లుడవుతున్నాడు’ అంటూ నెటిజన్లు చేసే కామెంట్స్‌తో వీరిద్దరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. అనిరుధ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు. స్టార్ హీరోలంతా అనిరుధ్ కోసం క్యూ కడుతున్నారంటే, ఈ బక్కోడు చేసే మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌.. ఇక పట్టుకోలేరేమో

స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా..?

Updated Date - Jun 28 , 2026 | 08:31 PM