సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జైలర్ 2 లో హృతిక్.. కూలీలో అమీర్ లా ఉండడుగా

ABN, Publish Date - Oct 07 , 2026 | 05:54 PM

ఈమధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో క్యామియోలు ఎంతటి హైప్‌ను తీసుకొస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద అంచనాలను ఆకాశానికి ఎత్తేయడానికి ఈ కాంబినేషన్లు బాగా ఉపయోగపడుతున్నాయి.

Jailer 2

ఈమధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో క్యామియోలు ఎంతటి హైప్‌ను తీసుకొస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద అంచనాలను ఆకాశానికి ఎత్తేయడానికి ఈ కాంబినేషన్లు బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఆ క్యామియోలు చివరికి సినిమాలో వర్కవుట్ అయ్యి హిట్ అవుతున్నాయా.. లేక ఫ్లాప్ (ఫట్) అవుతున్నాయా అనేది చాలా ఇంపార్టెంట్! సరైన ఎలివేషన్ పడకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా సీన్ తలకిందులవుతుంది. ఈ అంశమే ప్రస్తుతం తలైవర్ రజనీకాంత్ మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ జైలర్ 2 (Jailer 2) చుట్టూ తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.


దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ క్యామియోలో కనిపిస్తున్నాడు అంటూ ఖరారైనట్లు వార్తలు బయటకు వచ్చాయి. ట్రైలర్ లో కూడా హృతిక్ ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్త రజినీ ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్నిచ్చినా, మరోవైపు ఒక టెన్షన్‌ను తెచ్చిపెట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవర్ చేసిన గత చిత్రం కూలీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇచ్చిన క్యామియో ఏమాత్రం వర్కవుట్ కాకపోగా, దారుణంగా ఫ్లాప్ అయ్యి నెటిజన్ల నుంచి ట్రోల్స్ మూటగట్టుకుంది. ఆ క్యామియో మిగిల్చిన గాయం ఇప్పటికీ ఫ్యాన్స్ మనస్సులో ఉంది.


ఇప్పుడు జైలర్ 2లో కూడా హృతిక్ రోషన్ పాత్ర అంత వీక్‌గా ఉంటే సీన్ రివర్స్ అవుతుందేమోనని సినీ ప్రియులు భయపడుతున్నారు. అయితే నెల్సన్ మాత్రం జైలర్ మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ పాత్రలను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించారో తెలిసిందే. కాబట్టి ఆ రకమైన తప్పు నెల్సన్ చేయడని, హృతిక్‌కు బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ పవర్‌ఫుల్ మాస్ ట్రీట్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఏది ఏమైనా జైలర్ 2 లో చాలామంది స్టార్స్ ఉన్నారు. అయినా అందరి చూపు హృతిక్ మీదనే ఉంటుంది. ఇది కనుక వర్క్ అవుట్ అయితే మాత్రం జైలర్ 2 ని ఆపడం ఎవరి వలన కాదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో రజనీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మళ్లీ తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్‌న్యూస్

మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

Updated Date - Oct 07 , 2026 | 05:54 PM