అనిరుధ్ రిసెప్షన్.. టాలీవుడ్ ఎక్కడా కనిపించలేదేంటి చెప్మా
ABN, Publish Date - Nov 22 , 2026 | 02:49 PM
సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kaviya Maran) వివాహ రిసెప్షన్ వేడుక శనివారం రాత్రి చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kaviya Maran) వివాహ రిసెప్షన్ వేడుక శనివారం రాత్రి చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ, రాజకీయ, క్రీడా లోకం మొత్తం ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్స్ ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్లో దాదాపు అందరు అగ్ర హీరోలతో అనిరుధ్‌కు మంచి సాన్నిహిత్యం ఉండటంతో పాటు, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ వంటి స్టార్ల సినిమాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. కానీ, ఈ రిసెప్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు గానీ, ప్రముఖ దర్శక నిర్మాతలు గానీ ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ వంటి స్టార్లతో వరుస ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ, వారిలో ఎవరూ ఈ వేడుకలో సందడి చేయకపోవడంపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. చాలా మంది హీరోలు ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లలో బిజీగా ఉండటం వల్ల హాజరుకాలేకపోయారని ఒక వాదన వినిపిస్తుంటే, మరొకవైపు అసలు హైదరాబాద్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా మరో రిసెప్షన్ ఏమైనా ప్లాన్ చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. మహేష్ బాబు కుటుంబం మొత్తం ఈ వేడుకకు హాజరైనట్లు వార్తలు వినిపించాయి. కానీ, మహేష్ ఫ్యామిలీ ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు వారు వెళ్లింది అనిరుధ్- కావ్య రిసెప్షన్ కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, కావ్య మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఓనర్ కావడంతో, హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా ఇక్కడ వేరే వేడుక ఉండే అవకాశముందా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
మొత్తానికి చెన్నై వేడుకలో కోలీవుడ్ స్టార్లు, రాజకీయ ప్రముఖులు, ఎస్ఆర్హెచ్ క్రికెటర్ల హడావిడి బాగానే కనిపించినా.. టాలీవుడ్ హీరోల గైర్హాజరీ మాత్రం కొట్టొచ్చినట్లు కనిపించింది. మరి టాలీవుడ్ తారలు నిజంగానే షూటింగ్లలో బిజీగా ఉండి రాలేకపోయారా? లేక హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖుల కోసం స్పెషల్ పార్టీ ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. కోలీవుడ్ లో కూడా ఈ వేడుకకు ఎక్కువమంది స్టార్స్ హాజరుకాలేదు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, కమెడియన్ సతీష్, అట్లీ దంపతులు,హిప్ హాప్ తమిళ్, రాధిక శరత్ కుమార్, స్నేహ, విజయ్ భార్య సంగీత, డైరెక్టర్ శంకర్.. తదితరులు మాత్రమే ఈ వేడుకలో కనిపించారు. అనిరుధ్ తో పనిచేసిన చాలామంది స్టార్స్ ఈ వేడుకలో కనిపించలేదు. దీంతో ఈ వేడుక అత్యంత సన్నిహితుల మధ్యలోనే జరిగిందని తెలుస్తోంది.