వామికా గబ్బీ.. పెళ్లి నుంచి సన్యాసిని వరకు ప్లాన్స్
ABN, Publish Date - Oct 10 , 2026 | 04:02 PM
సాధారణంగా ఇండస్ట్రీలో విజయపథంలో దూసుకుపోయే హీరోయిన్స్ భవిష్యత్ ప్రణాళికలను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కొందరు పెళ్లి చేసుకొని, పిల్లలతో సెటిల్ అవుతారు.
సాధారణంగా ఇండస్ట్రీలో విజయపథంలో దూసుకుపోయే హీరోయిన్స్ భవిష్యత్ ప్రణాళికలను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కొందరు పెళ్లి చేసుకొని, పిల్లలతో సెటిల్ అవుతారు. ఇంకొందరు పెళ్లి కాకుండా అలా ఉండిపోతారు.అయితే జీవితంలో లేదా కెరీర్‌లో మనం అనుకున్న ఒక ప్లాన్ ఫెయిల్ అయితే వెంటనే నిరాశపడిపోకుండా ప్లాన్స్ పెట్టుకోవాలని అందాల భామ వామికా గబ్బి చెప్పుకొస్తుంది. తన జీవితంలో ఒక ప్లాన్ పోతే ఏంటి.. నా దగ్గర ఇంకో 25 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అంటూ ప్లాన్ ఏ నుంచి జెడ్ వరకు తన ప్లాన్స్ ని చెప్పుకొచ్చింది.
ఒకవేళ పెళ్లి, పిల్లలతో సెటిల్ అయితే ఓకే. అలా జరగకపోతే ప్లాన్-Bగా కుక్కపిల్లలను, ప్లాన్-Cగా పిల్లులను పెంచుకుంటూ సంతోషంగా ఉండొచ్చని సరదాగా వివరించింది. అలా ప్లాన్ ఏ నుంచి జెడ్ వరకు చెప్పుకొచ్చింది. జంతువులతో ఉండడం, ఫ్రెండ్స్ తో పార్టీ, ఫుడ్ తింటూ ఉండడం.. వర్క్ చేస్తూ ఉండడం, వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. చివరికి సన్యాసినిగా కూడా మారవచ్చు అని ఇలా ప్రతిదీ ఏఐ ద్వారా చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతచక్కగా వివరించావ్ వామికా అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉంటే, కెరీర్ పరంగానూ వామికా గబ్బి ఫుల్ స్వింగ్‌లో ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రంలో హెచ్.వినోద్ దర్శకత్వంలో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. గ్లామరస్ రీల్స్‌తో పాటు ఎంతో సందేశాత్మకమైన కంటెంట్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ భామ, రాబోయే రోజుల్లో సూర్య సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.