లోకేష్, అనిరుధ్‌లకు కార్లు ఓకే.. మరి వామికా చేసిన తప్పేంటి?
ABN, Publish Date - Sep 11 , 2026 | 04:31 PM
కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డీసీ (DC) చిత్రం ఊహించని రీతిలో భారీ వసూళ్లను సాధించి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డీసీ (DC) చిత్రం ఊహించని రీతిలో భారీ వసూళ్లను సాధించి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 7 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలక్షన్స్ రాబట్టింది. దాస్- చంద్ర నటనకు ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా తెచ్చిపెట్టిన అపరిమితమైన లాభాలతో అధినేత కళానిధి మారన్ ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా హీరో, దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ లకు బ్రాండ్ న్యూ బిఎమ్‌డబ్ల్యూ (BMW) లగ్జరీ కార్లను బహుమతిగా అందజేశాడు.
అయితే, ఈ సక్సెస్ గిఫ్టింగ్‌లో హీరోయిన్ కి అన్యాయం జరిగిందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా నటించిన వామికా గబ్బి పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. డీసీ సినిమాలో చంద్ర పాత్రలో జీవించేసి, సెకండ్ హాఫ్ మొత్తాన్ని తన అద్భుతమైన నటనతో నిలబెట్టిన వామికాను సన్ పిక్చర్స్ ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర విజయానికి ఆమె అందించిన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కీలక కారణమని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు ఆత్మలాంటి పాత్రలో నటించి, లోకేష్‌తో సరిసమానమైన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించిన హీరోయిన్‌ను పక్కనబెట్టి, కేవలం పురుష టెక్నీషియన్లకు మాత్రమే లగ్జరీ కార్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని,ఆమె చేసిన తప్పేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వామికాకు కూడా ఒక బిఎమ్‌డబ్ల్యూ కారు ఇవ్వాల్సిందే అని, మహిళా నటీనటులకు కూడా తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ విపరీతంగా పోస్టులు పెడుతున్నారు.
ఈ వివాదంపై సన్ పిక్చర్స్ లేదా వామికా గబ్బి వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఏదేమైనా, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన డీసీ వేడుకల్లో హీరోయిన్‌కు సరైన గుర్తింపు దక్కలేదనే అంశం ప్రస్తుతం కోలీవుడ్ సినీ వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయమై నిర్మాత కళానిధి మారన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.