తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేసిన గట్టా కుస్తీ 2 ఇప్పుడు తెలుగులో కూడా..
ABN, Publish Date - Jul 29 , 2026 | 04:11 PM
తమిళ చిత్రపరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో సత్తా చాటుతున్న హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal), హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా నటించిన చిత్రం గట్టా కుస్తీ (Gatta Kusthi).
తమిళ చిత్రపరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో సత్తా చాటుతున్న హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal), హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) జంటగా నటించిన చిత్రం గట్టా కుస్తీ (Gatta Kusthi). చెల్లా అయ్యవు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై రవితేజ, విష్ణు విశాల్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో మట్టి కుస్తీ పేరుతో రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ గా గట్టా కుస్తీ 2 ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సీక్వెల్ ని ఈసారి రవితేజ కాకుండా వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్స్ బ్యానర్‌పై ఇషారి గణేషన్, విష్ణు విశాల్ సంయుక్తంగా నిర్మించారు.
జులై 3 న రిలీజైన గట్టా కుస్తీ 2 తమిళ్ లో భారీ విజయాన్ని అందుకుంది. పార్ట్ 2ని కూడా తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేస్తారని భావించినప్పటికీ, మేకర్స్ చివరకు తమిళంలోనే థియేటర్లలో విడుదల చేశారు. భార్యభర్తల మధ్య గొడవలు.. వారి మధ్య పాప కామెడీ కూడా యాడ్ అవ్వడంతో ఫ్యామిలీస్ అన్నీ థియేటర్ కి క్యూ కట్టాయి. అంతేకాకుండా సీఎం విజయ్ సాంగ్ ను రీక్రియేట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.
ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని సొంతం చేసుకోగా, జులై 31 నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సీయాన్ రోల్డన్ అందించిన మ్యూజిక్, విష్ణు విశాల్ - ఐశ్వర్య లక్ష్మి మధ్య నడిచే కామెడీ, యాక్షన్ ఆడియన్స్‌ను విశేషంగా అలరిస్తున్నాయి. థియేటర్ లో వస్తుంది అనుకున్న ఈ సినిమా ఓటీటీలో రావడం, అది కూడా అన్నీ భాషల్లో అందుబాటులోకి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్ లో అలరించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. తెలుగువారిని ఎలా మెప్పిస్తుందో చూడాలి.