హీరోగా విజయ్ కొడుకు.. డైరెక్టర్ ఎవరో తెలుసా
ABN, Publish Date - Oct 30 , 2026 | 01:47 PM
సాధారణంగా స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి వస్తున్నారంటే భారీ మాస్ యాక్షన్ మూవీతో నేరుగా హీరోలుగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ జేసన్ సంజయ్ (Jason Sanjay) రూట్ పూర్తిగా భిన్నం.
సాధారణంగా స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి వస్తున్నారంటే భారీ మాస్ యాక్షన్ మూవీతో నేరుగా హీరోలుగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ జేసన్ సంజయ్ (Jason Sanjay) రూట్ పూర్తిగా భిన్నం. విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొంది, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సందీప్ కిషన్‌తో సిగ్మా (Sigma) అనే సినిమా ద్వారా ముందుగా దర్శకుడిగా పయనం ప్రారంభించారు. అయితే, గతంలోనే ఆయన మంచి కథ, నా పాత్రకు తగ్గ స్క్రిప్ట్ కుదిరితే తప్పకుండా కెమెరా ముందుకు వస్తాను అని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆ సరైన టైమ్ రావడంతోనే హీరోగా అడుగులు వేస్తున్నాడు.
దళపతి విజయ్‌తో తేరి, మెర్సల్, బిగిల్ లాంటి వరుస మైలురాళ్లను అందించి, జవాన్ తో పాన్-ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రంగంలోకి దిగడం విశేషం. విజయ్‌తో ఉన్న వ్యక్తిగత, ప్రొఫెషనల్ అనుబంధంతో జేసన్ సంజయ్‌ను అత్యంత గ్రాండ్‌గా, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో లాంచ్ చేసే బాధ్యతను అట్లీ తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది.
డ్యూడ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ కీర్తీశ్వరన్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాడట. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. కీర్తీశ్వరన్ తదుపరి చిత్రం స్టార్ హీరో శింబుతో ఉండాల్సి ఉంది. జేసన్ సంజయ్ అవకాశం రావడంతో కీర్తీశ్వరన్ నేరుగా వెళ్లి శింబుతో మాట్లాడగా.. 'విజయ్ కొడుకు సినిమా ముందుగా ప్రారంభమవ్వడం చాలా మంచి విషయం, నువ్వు నిరభ్యంతరంగా ఆ సినిమా పూర్తి చేసి రా అంటూ శింబు పెద్ద మనసుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన జేసన్ కి తండ్రి విజయ్ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదు. మరి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొడుకుకు విజయ్ నుంచి ఏమైనా సపోర్ట్ దక్కుతుందేమో చూడాలి.