సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

త్రిష లేకుండా విజయ్ బయటకు రాడా..

ABN, Publish Date - Nov 06 , 2026 | 03:18 PM

తమిళ సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం ఒకే ఒక్క జంట గురించి జోరుగా చర్చ నడుస్తోంది. వారే దళపతి విజయ్ (Vijay), హాట్ బ్యూటీ త్రిష (Trisha). ఒకప్పుడు ‘గిల్లి’, ‘తిరుపాచి’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ హిట్ జోడీ.. టైమ్ వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

Vijay, Trisha

తమిళ సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రస్తుతం ఒకే ఒక్క జంట గురించి జోరుగా చర్చ నడుస్తోంది. వారే దళపతి విజయ్ (Vijay), హాట్ బ్యూటీ త్రిష (Trisha). ఒకప్పుడు ‘గిల్లి’, ‘తిరుపాచి’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ హిట్ జోడీ.. టైమ్ వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న విషయం తెల్సిందే. ఆయన ఎలక్షన్ ప్రచారంలో మొదలైన వీరి రిలేషన్ రూమర్స్.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొద్దినెలల క్రితం ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత కల్పాత్తి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వీరిద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి జంటగా హాజరవ్వడంతో విజయ్ - త్రిష పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


విజయ్ తన వ్యక్తిగత జీవితంలో భార్య సంగీతతో విడిపోతున్నారని, విడాకుల దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ తరువాత విజయ్ కుటుంబ సభ్యుల ఒప్పందం మీద విడాకుల కేసును సంగీత వాపసు తీసుకుంది. దీంతో వీరికి విడాకులు లీగల్ గా ఇంకా రాలేదు. అయినా కూడా విజయ్ త్వరలోనే త్రిషను పెళ్లాడబోతున్నాడు అనే వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి. త్రిష కూడా విజయ్ ఎక్కడ ఉంటే అక్కడ కనిపిస్తూనే ఉంది. అసలు సీఎంగారు త్రిష లేనిదే బయట ఎక్కడా కనిపించరు అనే మాట కూడా వినిపిస్తోంది. దానికి నిదర్శనమే.. షర్మిలా- అనిల్ కుమార్తె పెళ్లి.


చెన్నైలో జరిగిన ఈ వెడ్డింగ్ వేడుకకు విజయ్- త్రిష జంటగా హాజరయ్యారు. విజయ్ బ్లాక్ అండ్ వైట్ సూట్ లో కనిపించగా .. త్రిష రోజ్ పింక్ కలర్ చీరలో అందమే అతివైతే ఎలా ఉంటుందో అలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ ఏ ఫంక్షన్‌కి లేదా ప్రైవేట్ పార్టీకి వెళ్లినా ఆయనతో పాటు త్రిష తప్పనిసరిగా ఉంటోందని, త్రిష లేకుండా విజయ్ బయటకు రావడం లేదా? .. వీరిద్దరిది విడదీయరాని బంధం అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, గాసిప్స్ వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా, వరుసగా పెళ్లిళ్లు, రిసెప్షన్లకు జంటగా హాజరవుతూ విజయ్ - త్రిష కోలీవుడ్ బాక్సాఫీస్ టాపిక్‌ను తమవైపు తిప్పుకుంటున్నారు.

Updated Date - Nov 06 , 2026 | 03:19 PM